Close

Culture & Heritage

తూర్పు గోదావరి జిల్లా చరిత్ర – సంస్కృతి

“ తూర్పు గోదావరి జిల్లా “ అనగానే గుర్తుకు వచ్చేది పచ్చని పైరు, పాపి కొండలు , గోదావరి నది తీర ప్రాంతం, కోనసీమ కొబ్బరి, ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజ, అన్నవరం శ్రీ సత్యనారాయణ మూర్తి గుడి, ఇంకా చాలానే ఉన్నాయ్. పూర్వం భౌతిక లక్షణాలను మరో విధముగా చూసినట్లైతే తూర్పు గోదావరి జిల్లలో నాలుగు విలక్షనమైన జీవావరణ వ్యవస్థలు కనిపిస్తాయి. అందులో ఒకటి అటవీ జీవావరణం , రెండు నదీ జీవావరణం, మూడు సముద్ర తీర జీవావరణం, నాలుగు మడ అడవులు. ఇవన్ని సహజసిద్ధంగా ఏర్పడ్డవే అయినా చారిత్రాత్మక యుగాల్లో మనిషి జోక్యం వళ్ళ కొన్ని మార్పులకు లోనైనవి.

గోదావరి దక్షిణ భారత దేశంలో ప్రవహించే నదులన్నిట్లోను పెద్దది. దీనిని ప్రపంచములోని అతి పెద్ద నదులలో ఒకటిగా అమెరికా సంయుక్త రాష్త్రముల భూగర్భ సర్వేక్షణ వారు నమోదు చేసారు. ఈ నది ప్రవాహపు సాంద్రతలోను , పరివాహిక ప్రదేసపు విస్త్రుతిలోను నైలు నది కన్నా మూడు రెట్లు పెద్దది గాను, థేమ్స్ నది కన్నా 200 రెట్లు పెద్దదిగాను గుర్తించడం జరిగినది.

 మన సంస్కృతి :  ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో గోదావరి మండలం నిర్వహించిన పాత్ర విశిష్టమైనది. సాంఘీక మార్పుల కోసం మొదలైన ఉద్యమాలకు ఇక్కడే అంకురార్పణ జరిగింది. సామాజిక ఉద్యమాల కేంద్రంగా మాత్రమె కాక, వేరొక కోణం నుంచి పరిశీలిస్తే, ఈ మండలం ఆంధ్రదేశoలో ఆధునిక యుగారంభానికే కేంద్ర బిందువుగా పరిగణించవచ్చు. భారత దేశంలో రాజధాని పట్టణాలైన బొంబాయి, కలకత్తా మొదలైన నగరాలు సాంఘిక, మత , సాoస్కృతిక ఉద్యమాలు బలంగా వేళ్ళునుకొని ప్రభావితం చేసిన దృష్టాంతం మద్రాసు పట్టణానికి కాక, రాజమండ్రికి చెందడం గమనించదగ్గ అంశం.

గోదావరి తీరాన వేగుచుక్కలు : మధ్యయుగపు చీకట్ల నుంచి కొత్త వెలుగు వస్తున్న తరుణంలో, ఆంధ్రదేశంలో భావచైతన్యం, హేతువాదద్రుష్టి ముఖ్యంగా సదారణజన జీవనశైలిపై ఆలోచనాపరుల ద్రుష్టిని మరల్చిన సంస్కరనోద్యమ ఉదయ తారలు స్వామినీన ముద్దు నరసింహం , కందుకూరి విరేసలింగం , చిలకమర్తి లక్ష్మి నరసింహం , రఘుపతి వెంకటరత్నం నాయుడు, ఆర్ధర్ కాటన్, పిఠాపురం మహారాజ రావు వెంకట సుర్యరాలు,  ఆక్స్ ఫోర్డ్ జెన్నింగ్స్ కూల్డ్రె మొదలైన చైతన్య మూర్తులు నవయుగ వైతలీకులు. వీరు గోదావరి జిల్లా చరిత్రను సామాన్య జన చరిత్రగా మార్చివేసారు.

 స్వామినీన ముద్దు నరసింహం

19 వ శతాబ్దం ప్రారంభం నాటికి సమాజంలో కులవ్యవస్థ, కరుడుగట్టిన సాంప్రదాయ, సాంఘీక దురాచారాలు, ఫ్యూడల్ దశలో బలపడిన స్త్రీల హీనస్థితి, అశాస్త్రీయమైన విద్యావిధానం, భౌతిక జడత్వం మొదలైన సామజిక రుగ్మతలపై పోరాటం చెయ్యటం మొట్టమొదట ప్రారంభించినవారు శ్రీ స్వామినీన ముద్దు నరసింహం. స్వామినీన ముద్దు నరసింహం 1810-1856 లో జీవించినట్లు తెలుస్తుంది. ఈయన  వ్యవహారిక భాషావాది, తొలి తెలుగు వ్యాసకర్త. తొలి తెలుగు వ్యావహారికభాషా వచన గ్రంథం హితసూచని (1853) రచయిత, హేతువాది . ఈయన పెద్దాపురం జిల్లా మునసబుగా పనిచేస్తూ చనిపోయారు. హితసూచనిని ముద్దునరసింహంనాయుని మరణానంతరం రాజమండ్రిలో న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన కుమారుడు రంగప్రసాధనాయుడు తొలిసారిగా 1862లో ముద్రింపజేశాడు. ఆ పుస్తకాన్ని 1986 లో రాజమండ్రి ఆంధ్రకేసరి యువజన సమితి వారు పునర్ముద్రించారు.

సర్ ఆర్ధర్ కాటన్  

గోదావరి జిల్లాను సస్యశ్యామలం చేసి ఆ నేలను సుభిక్షమైన ప్రాంతంగా, జనజీవితం సిరి సంపదలతో వర్ధిల్లేలా జీవజలాలతో నిమ్పినవాడు సర్ ఆర్ధర్ కాటన్ 1831లో అతివృష్టి, 1832లో తుఫాను, 1833లో అనావృష్టి, 1836లో కరువు, 1838లో వరదలు పైగా 1839లో కాకినాడ వద్ద పెనుతుఫాను మొదలైనవి గోదావరి మండలాన్ని దుర్భిక్షంతో ముంచెత్తాయి. ప్రజలు , పశుపక్ష్యాదులు, క్షామానికి తాళలేక కాందిశీకులుగా మారటమే కాకుండా కన్న బిడ్డలను తెగనమ్ముకున్న ఉదాహరణలున్నాయి. 1846 డిసెంబరు 23వ తేదిన బ్రిటిష్ ప్రభుత్వం ఆనకట్ట నిర్మాణానికి అనుమతి జారి చేసింది. 1847 సంవత్సరంలో ప్ర్రరంభామైన పని 1852 నాటికి పూర్తీ అయ్యింది. మానవాళి పట్ల కాటన్ కు ఉన్న మమకారం వాళ్ళ తూర్పు గోదావరి జిల్లలో శాంతి, సౌభాగ్యాలతో పాటు కొత్త చైతన్యం పుట్టడానికి దారి తీసింది.

 

Culture & Heritage
Culture & Heritage

హెచ్.ఇ. లార్డ్ ఆంప్తిల్ జి.సి.ఐ.ఇ ., మద్రాసు గవర్నర్ వారి చే ఈ చారిత్రాత్మక భవనం యొక్క శంకుస్థాపన 04-12-1903 నాడు జరిగినది. ఈ భవనం నిర్మాణం నియోక్లాసికల్ నిర్మాణ శైలిలో 1906 లో పూర్తయింది. R & B విభాగంలో అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం మొత్తం వ్యయం రూ. 1,59,832 / -. ఇక్కడ రాతి పని ద్వారా పునాది రాయి మరియు సున్నపు మోర్టార్తో భవనం రాయి నిర్మించబడింది. ఈ భవనం యొక్క పొడవు 85.34 మీటర్లు, ఎత్తు 9.5 మీటర్లు మరియు ప్లాంటు ప్రాంతం 1953 చ.మీ. అదే సంవత్సరం నిర్మాణంలో తదుపరి అదనపు చేర్పులు జరిగాయి, అనగా, 1906 లో రైతులకు సుమారు 112 చ.కి.మీ ప్రాంతంలో షెడ్ ను రూ. 2,899-00 గాను మరియు రూ. 3001-00 స్థిర ధరతో నిర్మించబడ్డాయి. ఇక్కడ నిర్మాణ ప్రణాళిక, గదుల లేఅవుట్, వాటి విశాలమైన ప్రదేశము, ప్రసరణ, ప్రసరణ ప్రాంతం, ఎత్తున్న ఫీచర్లు అన్ని క్రియాత్మకమైనవి. చెక్కిన కారిడార్లు, స్టోనో పియర్స్తో చెక్కిన రాజధాని మరియు సెమీ వృత్తాకార వంపులు కీస్టోన్తో నిర్మించబడ్డాయి. రాతి తాపీపని మరియు దాని భారీతనాన్ని బంధం యొక్క రకాన్ని బట్టి, భవనం భూకంపాల యొక్క ప్రభావాలకు తట్టుకోగలదు.