Close

ముఖ్య ప్రణాళిక అధికారి

ఎ).  ముఖచిత్రము

శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ:

జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భారత ప్రభుత్వము/రాష్ట్ర ప్రభుత్వముచే రుపొందినచినడిన వివిధ రంగాల యొక్క గణాoకాల సేకరణ, సంగ్రహణ మరియు విశ్లేషణలో పాల్గోనును. ఈ గణాoకాలను ప్రజల సంక్షేమము కొరకు వివిధ పధకాలు మరియు ప్రణాళికలు సూత్రీకరించుటలో ప్రభుత్వమునకు సహాయపడును.

బి). సంస్థాగత నిర్మాణ క్రమము

జిల్లా అధికారుల నుండి దిగువ స్థాయి అధికారుల సంస్థాగత నిర్మాణ క్రమము:

cpo

సి). పధకాలు/ కార్యకలాపాలు/ కార్యప్రణాళిక:

వ్యవసాయము మరియు కాలానుగుణ పరిస్థితులు:

I. వ్యవసాయము

(I) వర్షపాతం:  మండలానికి ఒకటి చొప్పున 64 మండలాలలో 64 రెవిన్యూ వర్షమాపక కేంద్రాలు కలవు. ప్రభుత్వము ఉత్తర్వులు ననుసరించి గ్రామీణ మరియు పట్టణ రెవిన్యూ కార్యాలయములో గల 64 రెవిన్యూ వర్షమాపక కేంద్రాల నుండి ప్రతీ దిన/ వారపు/ నెలవారీ వర్షపాత గణాంకాలను సేకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు వాతావరణ కేంద్రము, హైదరాబాదు (ఎoచుకున్న కేంద్రాలకు) నకు పంపబడును. జూన్ 2014 నుండి అధికార ప్రయోజనము కొరకు 130 ఎ.డబ్ల్యూ.ఎస్. వర్షమాపక కేంద్రాలను అన్ని జిల్లాల తహసీల్దార్లుకు సమీకృత వర్షపాత నమోదును తెలియు జేయుటకు స్థాపింపబడినవి. www.apsdps.ap.gov.in కు లాగిన్ అయినచో ఈ ఇంటిగ్రేటెడ్ వర్షపాతము యొక్క వివరములు తెలుకొనవచ్చును.

(ii) ఋతువు మరియు పంట పరిస్థితి నివేదిక:  వర్షపాతము, ప్రతీ వారపు/నెలవారీ ఋతువు మరియు పంట పరిస్థితి నివేదికను, పంటల వారీగా నాటిన వివరములను సేకరించి రాష్ట్ర ప్రభుత్వమునకు పంపిoచబడును.

(iii) వ్యవసాయ గణన:  ఖరిఫ్ సీజన్/ రబీ సీజనలలో సాగునీటి సదుపాయము కలిగిన మరియు సాగునీటి సదుపాయము లేని వివిధ పంటల తుది గణాంకాలను ప్రతి రెవిన్యూ గ్రామము నుండి సేకరించి, మండల, డివిజినల్ మరియు జిల్లా సంగ్రహ పట్టికలు తయారు చేయబడును. ప్రతీ సంవత్సరము ఈ రెండు సీజనలకు సంబంధించిన మండలాల వారీగా సంక్షిప్తము చేయబడిన జిల్లా సంగ్రహ పట్టికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు సమర్పిచబడును.

(iv) ప్రధాన మంత్రి ఫసల్ భీమ యోజన (PMFBY) :  ప్రధానమైన వరి పంటకు తూర్పుగోదావరి జిల్లాలో 2016 ఖరీఫ్ నుండి ప్రధానమంత్రి ఫసల్ భీమ యోజన/ ప్రధానమంత్రి పంట భీమా పధకం అమలులో ఉంది. గ్రామం యూనిట్ గా ఈ పంట భీమ పధకం అమలవుతుంది.

  1. ఈ గ్రామా భీమ పధకములో కనీసము 100 హెక్టార్లు ప్రధానమైన పంట ప్రాంతము కలిగిన గ్రామము ఒక యూనిట్ గా పరిగణింపబడును.

  2. గ్రామములో ఎంచుకున్న పంట ప్రాంతము 100 హెక్టార్ల కన్నా తక్కువగా న్నునచో ప్రక్కనున్న గ్రామాలను ఈ భీమా విభాగపు ఏర్పాటుకు సమీకరింవచ్చును .

  3. అమలు చేయువలసిన పంట కోత ప్రయోగాలూ

గ్రామం యూనిట్ గా అమలు చేస్తే ——————————- 4 ప్రయోగాలు

గ్రామాలు యూనిట్ గా అమలు చేస్తే —————————-  4 ప్రయోగాలు

5 గ్రామాలు కన్నా ఎక్కువ/మండలం యూనిట్ గా అమలు చేస్తే – 10 ప్రయోగాలు

తాలూకా యూనిట్ గా అమలు చేస్తే —————————- 16 ప్రయోగాలు చేయాలి.

భారత ప్రభుత్వము 2016 ఖరిఫ్ సీజన్ నుండి ప్రధాన మంత్రి ఫసల్ భీమ యోజన పధకమును ప్రారంభించింది. ఈ పధకమును రాష్ట్రం లోని అన్ని జిల్లాలలో అమలు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం చేసింది.

ప్రమాద భీమ మరియు మినహాయింపులు :

1. నాట్లు నిపుదల: (నోటిఫైడ్: ప్రాంతము ఆధారముగా) :  ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు, నోటిఫైడ్ ప్రాంతములో నున్న భీమ రైతులు భీమ చేసిన మొత్తములో నుండి 25% వరకు నష్టపరిహారం పొందుటకు ఆహార్వులు .

2. స్టాండింగ్ పంట (విత్తులు నుంచి కోయుట వరకు) : నిరోధించలేని ప్రమాదాలు – కరువు, పాడి వాతావరణము, వరదలు, తెగ్గుళ్ళు మరియు వ్యాధులు, కొండచరియలు విరిగిపడుట, అగ్ని ప్రమాదాలు, తూఫాన్లు, వడగండ్ల వానలు, టై ఫూన్లు, హరికేన్లు, సుడిగాలులు మొదలైన దిగుబడి నష్టములు వాటిల్లినపుడు సమగ్ర ప్రమాద భీమ యివ్వబడును.

3. కోసిన పంట ఆరుట కొరకు పొలములో ఉన్నపుడు, ఆకాల వర్షములు, తూఫాన్లు వంటి నిర్దిష్ట అపాయములు సంభాలించినప్పుడు, కోత కాలము నుండి 14 రోజులలో భీమ అందించబడును.

    1. రాష్ట్రంలో భీమా అమలు చేసే సంస్థలు:

వ్యసాయ భీమా కార్పొరేషన్

10 ఎoపిక కాబడిన ప్రైవేటు భీమా సంస్థలు

ప్రధాన మంత్రి ఫసల్ భీమా పధకము క్రింద జిల్లాలో రబీ సిజన్ లో గుర్తించబడిన పంటలు:

1. వరి (గ్రామా భీమా విభాగము)   2. మొక్కజొన్న   3. జిన్నా (యు.ఐ)   4. ఎండుమిరప   5. మినుములు   6. పెసలు

                వ్యవసాయ గణాంకాలలో ఉత్పత్తి అనునది ఒక ముఖమైన అనుబంధ ప్రమాణము. దీనికి ప్రాంతము మరియు దిగుబడి అవసరము. ఇతర చరరాశుల కన్నా                  దిగుబడి అతి సున్నితమైనది.

ఉత్పాదకతను అతి చిన్న ప్రమాణాలైన డెకా గ్రామములలో సరితూచి, ఫోరం -II లో ఫలితాలను నమోదు చేయవలెను.

v) పంట అంచనా సర్వేలు: వివిధ పంటలు ఉత్పత్తి సమాచారమును పొందుటకు ముఖ్యమైన ఆహార మరియు ఆహారేతర పంటలకు పంట కోత ప్రయోగాలు నిర్వహించి, ఎకరానికి వచ్చు దిగుబడిని క్షేత్ర ప్రోయోగాల నివేదికల ద్వారా పొందవచ్చును. ఈ విధముగా సేకరించిన దిగుబడి బట్టి భీమా చేయబడిన పంటలు యొక్క మండల సగటు దిగుబడిని లెక్కించవచ్చు. ఈ దిగుబడి సమాచారమును ఆధారముగా చేసుకొని పంట భీమా చెల్లింపులు డైరెక్టరేట్ అఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ చే ఖరారు చేయుబడును. పంట కోతకు వచినప్పుడు పంట కోత ప్రయోగాలూ ముఖ్య ప్రణాళిక అధికారి ఎన్.ఎస్.ఎస్.ఒ, అగ్రికల్చర్ మరియు జనరల్ ఇన్సూరెన్స్ మరియు సిబ్బందిచే పర్యేవేక్షిoచబడును.

(vi) ఫలాలు మరియు కూరగాయలు: 2016-17 సం. లో ఫలాలు మరియు కూరగాయలు సంబంధించి పంట కోత ప్రయోగాలూ నిర్వహించుటకు ఈ దిగువ ఉన్న పంటలు ఎంపిక చేయుబడినవి.

                   1. జీడి పప్పు   2.మామిడి   3. అరటి   4.కొబ్బరి   5. నిమ్మ   6. వంకాయ   7. బెండ   8. బత్తాయి   9. ఉల్లి

vii) వ్యవసాయ పంట ధరలు: పంట యొక్క ఉత్పత్తి విలువను విశ్లేషించుటకు కోత దశలో నున్న ముఖ్యమైన పంటల ద్వరా రైతు పొందు అసలు రేట్లు రద్దీ మార్కెట్ సమయములో సేకరించబడును.

viii) వ్యవసాయ గణాంకాలను సకాలంలో నివేదించుట: టి.ఆర్.ఎ.ఎస్. కార్డ్ ల ద్వారా ప్రతి సంవత్సరము వివిధ పంటల గణాంకాలు సేకరించుటకు మొత్తము రెవిన్యూ గ్రామలలో 20% నమునా గ్రామలు ఎంపిక చేయుబడును. (కార్డు నెo. 1 నుండి 4 వరకు) పేజి మొత్తం అడంగలు మరియు ప్రాంతం యొక్క గణనను నమూనా తనిఖి చేయటకు 1.0 మరియు 1.1 షెడ్యూల్స్ సేకరించబడును. పైన సేకరించిన సమాచారమును ఆధారముగా చేసుకొని ప్రభుత్వము ముందుగానే పంట ప్రాంతపు గణాంకాలను అంచనా వేయగలదు.

II ధరలు:

నిత్యావసర వస్తువుల ధరలు:  ప్రతిదినము 7 డివిజనల్ ప్రధాన కేంద్రాల యొక్క సంబంధిత ఎ.ఎస్.ఒ. ద్వారా ఆరు నిత్యావసర వస్తువుల రోజువారీ ధరలు సేకరించబడి, ఆన్ లైన్ ద్వారా డైరెక్టరేట్ అఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ , విజయవాడకు అందజేయుబడును.

ప్రతి వారాంతపు శుక్రవారము 7 డివిజనల్ ప్రధాన కేంద్రాల యొక్క సంభందిత డివిజనల్ డిప్యూటీ స్టాటిస్టికల్ అధికారులచే 21 నిత్యావసరాల వస్తువుల వారపు ధరలు సేకరించబడి. ఆన్ లైన్ ద్వారా D.E & S విజయవాడ కు అందజేయుబడును.

వినియోగదారుడి ధర పట్టిక (IW)/ వినియోగ ధరల సూచి:  ఎంపిక చేయబడిన పారిశ్రామిక కేంద్రాలైన రాజమండ్రి నుండి వారపు నెలవారీ వినియోగ ధరల సూచిని సేకరించి, డైరెక్టరేట్ అఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ , విజయవాడ వారికీ నేరుగా నివేదించబడును. ప్రతి నేల రాజమహేంద్రవరం నుండి వినియోగ ధరల సూచిని ఎంపిక చేసి ఈ షెడ్యూల్ ను నేరుగా D.E & S విజయవాడ కు అందజేయుబడును.

పారిశ్రామిక ఉత్పత్తి:  జిల్లాలో I.I.P ద్వారా 42 పరిశ్రములు ఎంపిక చేయబడినవి. ప్రతి నేల క్క్ పరిశ్రమ ఉత్పత్తి వివరములను సేకరించి, రాష్ట్ర పారిశ్రామిక వృద్ది రేట్ లెక్కింపు డైరెక్టరేట్ సమర్పించును.

వ్యవసాయ మరియు వ్యవసాయేతర కార్మికుల రోజువారీ వేతనాలు:
5 కేంద్రాలు (ఏడిద, కాట్రావులపల్లి, యు. కొతపల్లి ,అంబాజీపేట మరియు రంపచోడవరం నుండి వ్యవసాయ మరియు వ్యవసాయేతర కార్మికుల రోజువారీ వేతనాలు సేకరింపబడుచున్నవి. ఈ వివరములు ద్వరా డైరెక్టరేట్ అఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ , విజయవాడ కు అందజేయుబాడును

III. ప్రాంతీయ ఖాతాలు:  ప్రతి సంవత్సరము పెట్టుబడులు అంచనా వేయుటకు స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీలు, మండల ప్రజాపరిషత్ లు, జిల్లా పరిషత్ లు, మున్సిపాలిటీలు నుండి రశీదులు మరియు వ్యయము సేకరించబడి డైరెక్టరేట్ కు ఇవ్వబడుచున్నది. అదేవిధంగా GDP/MDP లెక్కింపు కొరకుప్రతి సంవత్సరము గ్రామపంచాయతీలు, మండల ప్రజాపరిషత్ లు, జిల్లా పరిషత్ లు, మున్సిపాలిటీలు యొక్క వార్షిక ఖాతాలు సేకరింపబడి ఆన్ లైనులో నమోదు చేయుబడుచున్నవి.

IV. గణాంకాల చేతి పుస్తకము తయారీ:   పరిశోధకులకు, ప్రణాళికులకు, నిపుణలకు మరియు ప్రజలకు ఉపయోగపడుటకు ప్రతి సంవత్సరము జిల్లో గల అన్ని ప్రధాన విభాగముల యొక్క గణాంకాల సమాచారము మరియు వారి విజయాలతో కూడిన వివరములు చిన్న పుస్తకము రూపములో ప్రచురము చేయబడుచున్నవి. 2016 సంవత్సరము క్రొత్త గణాంకాల చేతిపుస్తకము తయారీలో నున్నది.

V.  సామజిక ఆర్దిక సర్వే :   గృహ వినియోగం వ్యయం, గృహ సాంఘిక వినియోగం. ఆరోగ్యం మరియు విద్య మొదలగు అంశాలను వివరించు 75 వ సామజిక ఆర్దిక సర్వే జూలై 2017 నుండి ప్రారంభించబడి జూన్ 2018 న ముగియనున్నది.

VI.  జనాభా గణన సర్వే నిర్వహించుట:

i) భూమిపై యాజమాన్య జనాభా గణన:  ప్రతి గ్రామములో ప్రతి 5 సంవత్సరములకు ఒక సరి యాజమాన్య పరిమాణం.కౌలు యాజమాన్య నీటిపారుదల మెదలగు అంశాలలో మార్పులను అంచనావేయుతకు భూమిపై యాజమాన్య జనాభా గణన నిర్వహిచాబాడును. ఇటువల 2015-16 సం సర్వే నిర్వహిచబడినది. జిల్లా నివేదిక డైరెక్టరేట్ అఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ , విజయవాడ కు సంర్పించబడినది.

ii) చిన్న నీటిపారుదల గణన:  2013-14 సం 5 వ చిన్న నీటిపారుదల గణన చేయబడినది.

భూగర్భ నీటి పధకాల సంఖ్య ఉపరితల నీటి పధకాల సంఖ్య మొత్తము నీటిపారుదల పధకాలు
38885 2868 41753

Total Irrigation Schemes

iii) ఆర్దిక గణన:  వ్యాపార సంస్థ వృద్దిని విశ్లేషించుటకు మరియు వాటికీ మౌలిక సదుపాయములు కల్పించుటకు 5 సంవత్సములకు ఒక సారి వ్యాపార సంస్థ గణన జారును. ఇటివల 2012 సం ఆర్దిక గణన నిర్వహించబడినది. 6 వ ఆర్దిక గణన లో జిల్లాలో 3,58,255 గ్రామీణ వ్యాపార సంస్థ,91,582 పట్టణ వ్యాపార సంస్థ సర్వే చేయబడినవి.

iv) పరిశ్రమల వార్షిక సర్వే (ASI): పరిశ్రమల వార్షిక సర్వే 2002-03 సం ప్రారంభిచబడినది.ప్రతి సంవత్సరము పారిశ్రామిక రంగము నుండి స్దుల జిల్లా దేశాయ ఉత్పత్తికి పెట్టుబడుల ప్రణాళిక కొరకు ఎoపీక చేయబడిన పరిశ్రమల పారిశ్రామిక ఉత్పత్తి మరియు వాల్వు అడేడ్ కొరకు ఈ పరిశ్రమల వార్షిక సర్వే నిర్వహించబడును.

తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుత ధర

అంశం 2014-15 2015-16 2016-17
స్థూల జిల్లా దేశాయ ఉత్పత్తి GDDP రూ. కొట్లలో 57209 65231 74448
తలసరి ఆదాయం (పి.సి.ఐ (NDDP) –రూ. కొట్లలో 92526 105000 118248

డి.  సంప్రదించవల్సిన వారి వివరములు :

S.No Designation  Mobile No. Office Phone No. Fax No. Email Address
1 Joint Director & Chief Planning Officer 9849901478 2362746 (0884) 0884 2372746 cpoegkkd[at]gmail[dot]com
2 PIO & Statistical officer 9849901480 0884 -2362746 0884 2372746 cpoegkkd[at]gmail[dot]com
3 APIO & Dy.Statistical Officer 9640409498 0884 – 2362746 0884 2372746 cpoegkkd[at]gmail[dot]com

e) IMPORTANT LINKS :

Details of State Head Office  :    

Director,
Directorate of Economics & Statistics, Gollapudi,
Vijayawada.
Cell: 9849908540
Office No: 08662410312
Email address:desgollapudi[at]gmail[dot]com