తీర్థయాత్ర పర్యాటక రంగం
ఈ పర్యాటక రంగము యొక్క ప్రాధమిక ధ్యేయం దేవాలయాలకు, చర్చిలకు, మసీదులకు తీర్ధయాత్రలు నిర్వహించుట. తూర్పుగోదావరి జిల్లా గొప్ప వైవిధ్యము కలిగిన దేవాలయాలకు మరియు విగ్రహాలకు ప్రసిద్ది చెందింది. గొప్ప సంప్రదాయములకు, వారసత్వ సంపదకు, చారిత్రాత్మక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన ప్రదేశము. ఈ జిల్లలో గల కొన్ని చారిత్రాత్మక, ఎక్కువ సార్లు దర్సింపబడిన ప్రసిద్ది గాంచిన తీర్ధయాత్రా స్థలాల సూచిక మరియు వివరములు ఇవ్వబడినవి.
1. ర్యాలి: ర్యాలి రాజమహేంద్రవరంకు 38 కి.మీ.ల దూరంలో వశిష్ట మరియు గౌతమీ నదుల మధ్యనున్న మంత్రముగ్ధ ప్రదేశము. ఈ దేవాలయంలోని జగన్నాధ స్వామి వారి యొక్క దివ్య విగ్రహం నల్ల రాతితో చెక్కబడింది. ఈ విగ్రహం ముందు వైపు మహావిష్ణువు రూపము వెనుక వైపు జగన్మోహిని రూపము కలిగి ఉంటుంది. అంతేకాక 10 అవతారాల కచేరీలు, తుంబుర, నారద, రంభ, ఊర్వసి, గరుడ, గంగ ఇంకా చాలా వాటి యొక్క సంగ్రహావలోకనం చేయవచ్చు. ఇక్కడి భగవంతుడు స్వయంభువు గా చెప్పబడుతుంది.
2. బిక్కవోలు: బిక్కవోలు దేవాలయం వినాయక స్వామి వారికి అంకితం చేయబడింది. గుడి లోపల ప్రధాన దేవుని విగ్రహం 7 అడుగుల పొడవు ఉంటుంది. ఇది స్వయంభువు. బిక్కవోలు రాజమహేంద్రవరం నుండి 40 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ దేవతా మూర్తిని క్రీ.శ. 849 లో ప్రతిష్టించారని, అప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఈ విగ్రహ మూర్తి పెరుగుతూ ఉందని నమ్మకం. ఈ గుడి లో భక్తులు తమ కోరికలను దేవుని చేవిలో చెబుతారు. మరొక అద్భుతమైన విషయం ఇక్కడి దేవుని విగ్రహం యొక్క ఎడమ పాదం క్రింద నుండి నేరు ఉబికి వస్థూ ఉంటుంది.
3. గొల్లల మామిడాడ: గొల్లల మామిడాడ రాజమహేంద్రవరంకు 45 కి.మీ.ల దూరంలో పచ్చని పొలాలు మరియు కొబ్బరి తోటల మధ్యలో ఉంది. ఈ ప్రాంతంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం 16 ఎకరాల స్థలంలో 170 అడుగుల ఎత్తైన గోపురం కలిగి ఉన్నది. గోపురం మీద కనువిందు చేస్తూ 100 కు పైగా చెక్కిన శిల్పాలున్నాయి. వివిధ పురాణాల ఆధారంగా చెక్కిన దేవ దేవతల శిల్పాలు చూడటానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. గొల్లల మామిడాడకు ”చిన్న భద్రాచలం“ అని మరో పేరు కూడా ఉంది.
4. మార్కండేయ దేవాలయం: రాజమండ్రి లో కల పురాతన దేవాలయాల్లో ఈ మార్కండేయ స్వామీ వారి దేవాలయం ఒకటి. ఈ దేవాలయం 1818లో పునఃనిర్మాణం జరిగింది. ఇక్కడ మహా శివునితో పాటు అనేక దేవతలు ఒకే చోట కన్పించే విధంగా ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. ఇది గోదావరి ఒడ్డున ఉన్నది. అందుచేత భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించిన తరువాతే దేవాలయంలోకి ప్రవేశిస్తారు.
5. కోరుకొండ: ఇది రాజమహేంద్రవరానికి 25 కి.మీ.ల దూరంలో ఉన్నది. వైష్ణవ దివ్య క్షేత్రంగా ప్రసిద్ది చెందిన చారిత్రాత్మక పురాతన దేవాలయం. ఇది శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడింది. ఒక కొండపై స్వయంభువుగా వెలసినది. ఈ కొండకు 650 మెట్లు కలిగిన మార్గం ఉన్నది. ఈ దేవాలయం 800 సంవత్సరాల క్రితం నిర్మించబడినది.
6. రాయల్ మసీదు: క్రీ.శ. 1305 లో మహమ్మద్ బీన్ తుగ్లక్ కుమారుడైన సుమేరా సాహెబ్ చే నిర్మించబడిన రాయల్ మసీదు రాచఠీవీ నొలికిస్తూ రాజమహేంద్రవరం నడిబొడ్డున ఉన్నది. ఇది చూడదగిన అతి పురాతనమైన స్మారక చిహ్నము. 700 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ నిర్మాణము, మత సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచియున్నది.