గ్రామీణ నీటి సరఫరా
ఎ) ప్రొఫైల్
శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ:
కాకినాడ, పెద్దాపురం, రాజమహేంద్రవరం, రంపచోడవరం, రామచంద్రాపురం, అమలాపురం మరియు ఎటపకలలో ప్రధాన కార్యాలయాలు కలిగి 7 రెవిన్యూ డివిజన్లు కలిగివున్నది. 64 రెవిన్యూ మండలాలు మరియు 62 గ్రామీణ మండల పరిషత్తులు ఈ జిల్లలో కలవు. ఈ జిల్లలో ఖమ్మం జిల్లా నుండి కొత్తగా కలుపబడిన పంచాయితీలతో కలిపి మొత్తము 1069 గ్రామ పంచాయితీలు కలవు.
2 మున్సిపల్ కార్పోరేషన్లు కాకినాడ మరియు రాజమహేంద్రవరం మరియు 7 మున్సిపాలిటీలు సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం, తుని, రామచంద్రాపురం, మండపేట మరియు అమలాపురం కలవు.
గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత మంచినీటి సరఫరా మరియు పరిశుధ్యము, గ్రామీణ నీటి సరఫరా శాఖ యొక్క బాధ్యత. గ్రామీణ ప్రాంతాలలో మంచినీటి సరఫరా కొరకు 3,371 నివాస ప్రాంతాలలో ప్రభుత్వము వారు 12,372 చేతి పంపులు అమర్చిరి. మరియు 2,164 PWS/MPWS పధకాలు మరియు 54 CPWS పధకాలు ప్రవేశపెట్టిరి. 1,636 నివాస ప్రాంతాలలో గల 22.20 లక్షల జనాభాకు CPWS పధకము (శ్రీ సత్య సాయి నీటి సరఫరా ప్రాజెక్టుతో కలిపి) ద్వారా మంచినీటి సరఫరా చాల సంవత్సరాల నుండి చేయుచున్నారు. 10 మండలాలలో (అప్ ల్యాండ్ మరియు ఏజెన్సీ ఏరియా) 212 గిరిజన నివాసిత ప్రాంతాలలో గల 2.62 లక్షల జనాభాకు శ్రీ సత్య సాయి నీటి సరఫరా పధకము ద్వారా రక్షిత మంచినీరు అందించబడుతుంది.
క్రొత్తగా కలుపబడిన 4 మండలాలతో కలిపి నివాసిత ప్రాంతాల హోదా (ది. 01-04-2017 నాటికి)
హోదా | మొత్తము నివాసిత ప్రాంతాలు | NC | NSS | PC1 | PC2 | PC3 | PC4 | FC |
---|---|---|---|---|---|---|---|---|
ఏజెన్సీ కానిది | 2267 | 0 | 34 | 67 | 299 | 501 | 471 | 895 |
ఏజెన్సీ | 1104 | 2 | 0 | 115 | 153 | 116 | 140 | 578 |
నివాసిత ప్రాంతాల మొత్తము | 3371 | 2 | 34 | 182 | 452 | 617 | 611 | 1473 |
NC నివాసిత ప్రాంతాలు: పాములమామిడి II & ఇజ్జలూరు అఫ్ రాజవొమ్మంగి మండలం
NC : నివాసిత ప్రాంతాలు కాకుండా
NSS : రక్షిత ఆధార వనరు లేనటువంటి
PC1 : పాక్షికంగా సరఫరా కలిగినవి 0.01 – 13.75 LPCD
PC2 : పాక్షికంగా సరఫరా కలిగినవి 13.76 – 27.5 LPCD
PC3 : పాక్షికంగా సరఫరా కలిగినవి 27.51 – 41.25 LPCD
PC4 : పాక్షికంగా సరఫరా కలిగినవి 41.26 – 54.99 LPCD
బి) సంస్థాగత నిర్మాణ క్రమము
జిల్లా అధికారుల నుండి దిగువ స్థాయి వరకు సంస్థాగత నిర్మాణ క్రమము:
సి) పధకాలు/కార్యక్రమాలు/కార్యాచరణ ప్రణాళిక:
చేతిలో గల పనులు
పధకము | పనుల మొత్తం | అంచనా వ్యయం మిగులు 01-04-17 నాటికి | 2017-18 వ్యయం | పని యొక్క స్థితి | నివాసిత ప్రాంతాల లక్ష్యం 17-18 సంవత్సరానికి | వ్యాఖ్యలు | ||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
C | P | NS | లక్ష్యం | ఆగష్టు’17 గల లక్ష్యం | సాధించబడినది | |||||
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
NRDWP MVS | 7 | 5275.05 | 644.20 | 5 | 2 | 0 | 120 | 0 | 0 | కొత్తపేట మరియు కరపలలో పనులు జరుగుచున్నవి. |
NABARD (MVS) | 3 | 1964.78 | 148.38 | 0 | 3 | 0 | 79 | 79 | 23 | తుని, సూర్యారావుపేట, పిఠాపురం |
NABARD (SVS) | 2 | 157.00 | 0.00 | 0 | 0 | 2 | 2 | 0 | 0 | LOA ఒప్పంద పత్రం సమర్పించడమైనది. |
NRDWP SVS | 5 | 173.96 | 98.27 | 3 | 0 | 2 | 4 | 2 | 2 | పోతులూరు, వడిసలేరు మరియు అంగర పనులు పూర్తి అయినవి. |
NRDWP SAGY | 3 | 478.96 | 81.54 | 0 | 3 | 0 | 20 | 0 | 5 | పుల్లేటికుర్రు, బూరుగుపూడి, మారేడుమిల్లి పనులు జరుగుచున్నవి. |
SOLAR | 40 | 196.00 | 174.64 | 40 | 0 | 0 | 40 | 40 | 40 | పూర్తి అయినది. |
I.T.D.A (SDP CM Funds) | 108 | 1199.60 | 0.00 | 0 | 1 | 107 | 108 | 1 | 0 | టెండర్స్ పిలవదమైనది. |
Total | 168 | 9445.35 | 1147.03 | 48 | 9 | 111 | 373 | 122 | 70 |
సి: పూర్తి అయినది ; P : పనులు జరుగుచున్నవి, ; NS : మొదలు కానివి.
స్వచ్చ భారత్ మిషన్ (గ్రామీణ):
2019 నాటికి బహిరంగ మల విసర్జనా రహిత (ODF) భారతదేశాన్ని పొందడానికి ప్రభుత్యం వారిచే స్వచ్చ భారత్ మిషన్ (SBM) 2 అక్టోబర్ 2014న ప్రారంబించబడినది.
జిల్లలో IHHLs యొక్క స్థితి :
1. మండలములు : 62
2. గ్రామ పంచాయితీలు : 1069
౩. 31.03.2017 నాటికి ODF సాధించిన గ్రామపంచాయితీలు : 515
4. ఇంకా మిగిలిన 2017-18 నాటికి : 554
2017-18 కోసం కార్యాచరణ ప్రణాళిక
యూనిట్లు | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | మొత్తం | |
---|---|---|---|---|---|---|
లక్ష్యం | గ్రామపంచాయితీలు | 55 | 73 | 167 | 259 | 554 |
సాధించినవి | గ్రామపంచాయితీలు | 55 | 4 | – | – | 69 |
అక్టోబర్ 2017 నాటికి బహిరంగ మల విసర్జనా రహిత జిల్లాగా చెయ్యాలని లక్ష్యం నిర్దేశించబడినది.
డి) పరిచయ వివరాలు :
వరుస సంఖ్య | హోదా | చరవాణి సంఖ్య | మెయిలింగ్ చిరునామా |
---|---|---|---|
1 | సుపెరింటెండింగ్ ఇంజనీర్ | 9100121100 | se_rws_egd[at]ap[dot]gov[dot]in |
2 | ఎగ్సిక్యుటివ్ ఇంజనీర్, కాకినాడ | 9100121101 | ee_rws_kkd[at]ap[dot]gov[dot]in |
3 | ఎగ్సిక్యుటివ్ ఇంజనీర్, రాజమహేంద్రవరం | 9100121102 | eerwssrjm[at]gmail[dot]com |
ఇ) ముఖ్యమైన లింకులు:
http://rwss.ap.nic.in/pred/