మురమళ్ళ క్షేత్రం అమలాపురం నుండి 25 కిలోమీటర్ల దూరంలోనూ, కాకినాడ వయ యానం నుండి 38 కిలోమీటర్ల దూరంలోనూ మరియు రాజమండ్రి వయా రావులపాలెం నుండి 105 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. మురమళ్ళ మేజర్ గ్రామ పంచాయతీ. ఇది ముమ్మిడివరం మండలంలో కలదు. కాకినాడ, అమలాపురం మరియు రాజమండ్రి నుంచి పరిమిత బస్సులు నడుపుతున్నాయి. మురమళ్ళ గ్రామం జాతీయ రహదారి 214 కత్తిపూడి – పామారు మధ్య కలదు. పవిత్ర గోదావరి నది యొక్క ఉపనది అయిన గౌతమి నదిపై నిర్మించిన GMC బాలయోగి వారధిపై నుండి ప్రతి బస్సు లేదా ఇతర వాహనాలు మురమళ్ళ క్షేత్రం మీదుగా ప్రయాణిస్తాయి.