Close

పర్యావరణ పర్యాటక రంగం

పర్యాటకులపై వాతావరణ ప్రభావము మరియు సాంస్కృతిక ప్రభావము లేకుండా విజ్ఞానాన్ని పెంపొందించే విధముగా పర్యావరణ పర్యాటక రంగము వారు సహజ సిద్దమైన ప్రదేశాలకు ప్రయాణాలను భాద్యతా యుతంగా నిర్వహిన్స్తున్నారు. పర్యావరణ పర్యాటకము కార్యక్రమములోని ప్రాధమిక ఏర్పాటులో భాగముగా అడవులు మరియు వన్యా ప్రాణులు ఉంటాయి.

EcoTourismమారేడుమిల్లి
తూర్పు కనుమలలో గల గొప్ప జీవ వైవిధ్యాన్ని మారేడుమిల్లి అడవులలో చూడవచ్చు. ఈ పర్యాటక ప్రదేశము మారేడుమిల్లి – భద్రాచలం మార్గములో మారేడుమిల్లి గ్రామమునకు 4 కి.మీ.ల దూరములో గలదు. మూడు వైపులా ప్రవహిస్తున్న వాలమూరు నదికి ప్రక్కన జంగిల్ స్టార్ స్థావరం ఉన్నది. ఈ వాలమూరు నది నీరు వాలి-సుగ్రీవ కొండ మీదుగా ప్రవహిస్తున్నది. రామాయణ కాలములో వాలి-సుగ్రీవుల యుద్దము జరిగిన ప్రాంతము వాలి-సుగ్రీవ కొండగా నమ్మబడుతుంది. 1914 లో మారేడుమిల్లి గ్రామములో అన్ని సదుపాయములు కలిగిన విశ్రాంతి గృహమును నిర్మించారు. పర్యాటకులు బస చేయుటకు ప్రత్యేక విశ్రాంతి గృహాలు లభ్యమవుతాయి.

 

Kadiyamకడియం
కడియం రాజమండ్రికి 14 కి.మీ.ల దూరములో కలదు. కడియంలో అనేక పూల మొక్కల జాతులు కలిగిన ఆహ్లాదకరమైన, ఆకుపచ్చ రంగులో అనేక పూల తోటలు కలవు. ఇక్కడకు వచ్చిన సందర్శకులు ఈ పూలతోటల నుండి అనేక రకాల మొక్కలను కొనుక్కోవచ్చును. ప్రతి సంవత్సరము జనవరి మాసములో నిర్వహించే పూల ప్రదర్శనను తప్పక చూడాలి. ఇక్కడ నుండి పెరటి తోటలకు, మరియు వ్యవసాయానికి అవసరమగు అనేక రకాల మొక్కలు ప్రపంచ వ్యాప్తముగా అనేక ప్రదేశాలకు ఎగుమతి చేయబడుచున్నవి.

 

 

PapiHills

 

పాపికొండలు
రాజమండ్రి – భద్రాచలం మధ్య బోటు మార్గములో పాపికొండలు కలవు. ఇది దట్టమైన అడవులతో చుట్టుముట్టబడిన అందమైన పర్యాటక ప్రదేశము. పాపి కొండలపై నున్న జాతీయ అటవీ స్థలములో పులులు, చిరుతలు, చుక్కల జింకలు మరియు సాంబాలు వున్నవి. పాపి కొండలపై నున్న కుటీరాలలో బస చేయుటకు ప్యాకేజీలు కలవు. పడవలో ప్రయాణము చేస్తున్నప్పుడు సూర్యోదయం చాలా అందముగా కనిపించును.

 

 

 

RCPM

 

రంపచోడవరం
రాజమండ్రికి 50 కి.మీ.ల దూరములో ప్రకృతి అందాలతో ఆహ్లాదపరిచే గిరిజన గ్రామము రంపచోడవరం. ఇది మారేడుమిల్లికి 26 కి.మీ.ల దూరములో కలదు. ఇక్కడ కుడా ప్రకృతి ప్రేమికుల కొరకు పర్యావరణ స్నేహ పూర్వక ప్రదేశాలైన అడవులు, జలపాతాలు కలవు. ఇక్కడ దట్టమైన అడవి గుండా సాగే ప్రయాణము గగుర్పాటు కలిగించే అనుభవము కల్గిస్తుంది.

 

 

PinjaraKonda

 

పింజరకొండ
తూర్పు గోదావరి జిల్లాలో పింజరకొండ ఒక మంచి విహారకేంద్రము. రాజమండ్రికి 80 కి.మీ.ల దూరములో, కాకినాడ కు 86 కి.మీ.ల దూరములో, తునికి 80 కి.మీ.ల దూరములో కలదు. ఈ ప్రదేశానికి ప్రత్యక్ష ప్రయాణ సౌకర్యము లేదు. అందుచేత పింజరకొండ దర్శించుటకు సొంత వాహన సౌలభ్యము కలిగి ఉండాలి. పింజరకొండ నుండి 30 కి.మీ.ల దూరములో ఉన్న ఏలేశ్వరం వద్ద ఏలేరు రిజర్వాయరు ప్రాజెక్టును కుడా చూడవచ్చు. ఏలేశ్వరం నుండి పింజరకొండ దృశ్యము అద్భుతముగా, విస్మయకర దృశ్యముగా నుండును.

 

 

Coringa

 

కోరింగ వన్యప్రాణుల అభయారణ్యము
భారతదేశంలో రెండవ అతి పెద్ద మడ అడవి ఈ కోరింగ అభయారణ్యము. తూర్పు గోదావరి జిల్లా కేంద్రము మరియు రేవు పట్టణమైన కాకినాడకు 18 కి.మీ.ల దూరంలో ఈ అభయారణ్యము గలదు. ఇక్కడ 35 రకాల మడ వృక్ష జాతులు మరియు 120 రకాల పక్షి జాతులు వున్నాయి. ఇక్కడ గౌతమీ మరియు గోదావరి నదుల నీళ్ళలో పడవలు నడుపవచ్చు. ఇక్కడ ఉప్పు నీటి మొసళ్ళు వుంటాయి. ఈశాన్యములో నున్న 18 కి.మీ.ల పొడవైన ఇసుక గుంత ప్రధాన ఆకర్షణ.

 

 

Konasema

 

కోనసీమ
ఈ కోనసీమ ప్రాంతము ప్రశాంతమైన, మనోహరమైన, అందమైన ఒయాసిస్ వంటిది. ఇది పర్యాటకుల కలల యాత్రకు ఒక గమ్య స్థానము. ఈ కోనసీమ చుట్టూ బస్సు లేక రైలు లేక బోటులో ప్రయాణిస్తూ కోనసీమ అందాలను చూడవచ్చు. గాలిలో లయబద్ధముగా తలలూపుతున్న కొబ్బరి మరియు తాటిచెట్ల అద్భుత ప్రకృతి దృశ్యానికి ఈ ప్రాంతము ప్రసిద్ధి. ఇక్కడ భూమియంతా సుక్షేత్రము. ఇది పచ్చదనానికే కాకుండా కళాత్మక దేవాలయాలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతపు ప్రాముఖ్యతకు మరొక ముఖ్యకారణము ఇక్కడి ఆహార పదార్ధాలతో చేయబడిన రుచికరమైన వంటకాలు.