Close

మున్సిపల్ కమిషనర్, సబ్ కలెక్టర్ రాజమహేంద్రవరం స్పందనలో పిటిషన్లు స్వీకరించారు.

Publish Date : 23/07/2019
Spandana - Rajamahendravaram

డిగ్రీ,పి.జి పూర్తి చేసిన చెవిటి,మూగ విద్యార్థుల కు ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల లో ఉపాధి కల్పించందుకు అన్ని చర్యలు తీసుకుంటామన రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ మరియు మునిసిపల్ కమిషనర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు.సోమవారం స్థానిక సబ్-కలెక్టర్ కార్యాలయనందు స్పందన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.స్థానిక ప్రియదర్శిని స్వచ్చంద సేవ సంస్థ లో విద్యనభ్య సిస్తున్న విద్యార్థులు డిగ్రీ,పి.జి,ఐ.టి.ఐ.కోర్సులు చదివి ఉన్నారని వీరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆ సంస్థ ప్రిన్సిపాల్ ఆశలత విద్యార్థుల తో వచ్చి స్పందించిన లో సబ్-కలెక్టర్ ని కోరారు.తప్పనిసరిగా చెవిటి,మూగ విద్యార్థులకు ప్రభుత్వ సంస్థల తో పాటు ప్రైవేటు సంస్థలలో ఉపాధి ఏర్పాటుకు ప్రైవేట్ సంస్థలతో ప్రత్యేకంగా మాట్లాడతానని ఆయన అన్నారు. అర్హత ఉంటే తప్పనిసరిగా రేషన్ కార్డులు,పింఛన్లు మంజరికి ప్రభుత్వన్ని కొరతామని అన్నారు. సబ్-కలెక్టర్ కార్యక్రమంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.ప్రజలు ఎక్కువ సంఖ్యలో విచ్చేసి సబ్-కలెక్టర్ కు విజ్ఞాపణలు అందజేశారు.విజ్ఞాపణలు వచ్చిన వాటిలో ఎక్కువ సంఖ్యలో ఇండ్ల ఇప్పించాలని విజ్ఞప్తిలు వచ్చాయి.ఈ సందర్భంగా సుమిత్ కుమార్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులు అన్నిటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.అర్హత ఉన్నవారికి తప్పనిసరిగా రేషన్ కార్డులు,పింఛన్లు మంజరికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని అన్నారు.స్థానిక కొర్లమ్మ పేట కు చెందిన యండమూరి.ప్రభాకర్(30)ఇతని కి రెండు కాళ్ళు నడవాటానికి వీలు కావడం లేని స్థితిలో ఉన్నానని నాకు రేషన్ కార్డ్ లేదని దయచేసి కార్డ్ ఇప్పించాలని స్పందిన లో విజ్ఞప్తి చేశారు.సందసత్రం దగ్గరలో వుంటున్న జామి.సత్యనారాయణ వృద్ధాప్య పింఛను ఇప్పించాలని కోరారు.కడియం మండలం ఎమ్.ఆర్.పాలెం నకు చెందిన శ్రీమతి ఎమ్.నాగమణి స్థలం సర్వ్ చేయంచాలని దరఖాస్తు చేశారు.48 వ వార్డు కు చెందిన నక్క.దీవేన మరియు నక్క.శామ్యూల్ రాజు నగరంలో నాగరాజు హై స్కూల్ నందు చదువు చున్నారు వీరికి ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ ఇప్పించాలని విజ్ఞప్తి చేసారు.కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ-జి.సోములు,డివిజన్ పంచాయతీ అధికారి జె.సత్యనారాయణ,ఎ.ఓ-శ్రీమతి దేవి,డాక్టరు శ్రీమ కోమలి,డాక్టర్ లక్ష్మీ పతి,కార్పొరేషన్ అధికారి రమణ రావు తదిరశాఖల అధికారులు పాల్గొన్నారు.