Close

సాంస్కృతిక పర్యాటక రంగం

ప్రయాణించడానికి ప్రధాన లక్ష్యం సంస్కృతి. పర్యాటక రంగంలో సంస్కృతి ముఖ్యమైన ప్రాత్ర వహిస్తుంది. పర్యాటకులలో సంస్కృతి పట్ల ప్రత్యేక శ్రద్ధ, అభిలాష పెరిగిన ప్రస్తుత ధోరణి వలన పర్యాటక పరిశ్రమలో సంస్కృతిక వారసత్వ పర్యాటకం అతి త్వరగా అభివృద్ధి చెందుతున్న ఒక విభాగము.

NTRBeachFestivalకాకినాడ సాగర సంబరాలు

సముద్రతీరాన్ని ప్రేమించే పర్యాటకులకు కాకినాడ తీరము (NTR బీచ్ గా నామకరణం చేయబడినది) ఒక మంచి గమ్యము. ఈ సంబరం చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నదని భావించారు. ఈ నాలుగు రోజుల పండుగ సందర్భముగా విచ్చేసిన తెలుగు సినిమా పరిశ్రమ నటీనటులు, అతిధులు ప్రజాకర్షణకు కేంద్ర బిందువులుగా నిలిచారు. ఈ పండుగకు కడియం వారి ఫల పుష్ప ప్రదర్శన మరింత రంగులద్దింది. ఆక్వా రంగము మరియు గోవా రాష్ట్ర పరిపాలనా విభాగము వారి సహకారంతో ఏర్పాటు చేయబడిన జల క్రీడలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

 

 

KonaSeema

కోనసీమ ఉత్సవాలు

పోలవరం మండలములోని మురమళ్ళ గ్రామంలో కోనసీమ పండుగ నిర్వహించబడును. వివిధ ప్రాంతాలు, ఇతర జిల్లాల నుండి అనేక వేల మంది ప్రజలు ఈ పండుగలో పాల్గోనెదరు. ఈ ప్రాంతం యొక్క అందము మరియు సంస్కృతిని ఈ కోనసీమ ఉత్సవం ప్రతిభింబిస్తుంది. ఈ ఉత్సవములో 2K రన్ రెండు కి.మీ.ల పరుగు నిర్వహించబడుతుంది. ప్రసిద్ద దేవాలయాల ప్రతిరూపాలు ఇక్కడ ఏర్పాటు చేయబడును. చాలా సాంస్కృతిక కార్యాక్రమాలు కుడా నిర్వహించబడును.

 

 

ManyamJataraమన్యం జాతర

మూడు రోజుల పాటు జరిగే ఈ జాతర గిరిజన జాతుల యొక్క ఆచారాలు, సంప్రదాయాలు మరియు సంస్కృతిని ప్రతిబింబించేలా చేస్తుంది.  తూర్పు గోదావరి జిల్లా పరిపాలనా నిర్వహణ మరియు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ వారు కలిసి ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచేందుకు ఈ మన్యం జాతరను నిర్వహిస్తున్నారు.  ఈ మన్యం జాతరలో 60 శాతము స్థానిక గిరిజన జాతులు 40 శాతం ఇతర జిల్లాల ప్రజలు పాల్గొంటారు.  ఆహార పదార్ధాలు మరియు వివిధ రకాల వెదురు ఉత్పతులు ఇక్కడ ప్రదర్శింపబడతాయి.

 

 

Peruru Village

పేరూరు

తూర్పుగోదవరి జిల్లా కోస్తా ప్రాంతములో గల అమలాపురంకు సమీపంలో పేరూరు ఒక చిన్న గ్రామము. పేరూరులో నడుస్తున్నప్పుడు శతాబ్దాల కాలము నాటి పాత ఆంధ్ర పట్టణములో నడచిన అనుభూతి కలుగును. ఈ ఉరిలో చాలా పాతబడిన వంశపారంపర్య గృహాలైన అతిపెద్ద భవంతులతో నిండి ఉంటుంది. రాజమహేంద్రవరం నుండి 3-4 గంటలలో పేరూరు చేరుకోవచ్చు.

 

 

PandavulaMetta

 

పాండవ మెట్ట

ఈ జిల్లాలో చిన్న పట్టణమైన పెద్దాపురంలో ఒక కొండ మీద ఉన్న పాండవమెట్ట గురించి చాలా మందికి తెలియక పోవచ్చును. ఈ కొండ పాండవుల వనవాసము గురించి తెలియజేస్తుంది. పాండవులు రామేశ్వరం వెళ్ళే దారిలో పెద్దాపురంలో ఒక కొండపైన కొద్ది కాలం ఉన్నారు. అందుచేత ఈ కొండకు పాండవుల పేరు మీదుగా పాండవ మెట్ట అనే పేరు వచ్చింది.