Close

జిల్లా గురించి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగిన పెద్ద జిల్లా ఈ తూర్పు గోదావరి.  మౌర్యులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, తూర్పుచాళుక్యులు, కాకతీయులు, చొళులు, ముసునూరి జమిందార్లు, కొండవీటి రెడ్డి రాజులు, గజపతులు, కుతుబ్ షాహిలు తరువాత బ్రిటిష్ వారిచే పరిపాలింపబడినది. 1925 ఏప్రిల్ 15 వ తేది జి వో. నెo 502 ప్రకారము, తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రంలోనే అతి పెద్ద ధనిక జిల్లాగా పరిగణింపబడుతున్నది. మరియు కళ సాహిత్య రంగముల యుందు ఉన్నత స్థాయిలోను, పర్యాటక హబ్ గాను ఉన్నది.

గోదావరి

గోదావరి నది మహారాష్ట్ర నాసిక్ లో ప్రారంభమై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ల గుండా ప్రవహించి రాజమండ్రిలో బలమైన, గంభీరమైనదిగా మారినది. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద నదిగా గోదావరి నది పరిగణింపబడినది. గోదావరి నది చాల ఉపనదులతో దేశము నందు 1/10 వంతు ఆక్రమించుకొనినది. ఈ నది యొక్క మొత్తం పొడవు 1450 కి మీ. ఇది ఆంధ్రప్రదేశ్ లో 927 కి మీ విస్తీర్ణములో ప్రవహించుచున్నది.

RJY3

గోదావరి ఉపనదులు సప్త మహా ఋషులైన గౌతమ మహర్షి , వశిష్టుడు, అత్రి, విశ్వామిత్రుడు, కౌశికుడు, భారద్యాజుడు మరియు అగుస్త్య మహాముని పేర్లమీద పిలువబడుచున్నవని ఒక కధ కలదు. ప్రస్తుతము గౌతమి మరియు వశిష్ట ఉపనదులు మాత్రమే కనిపించుచునవి. గోదావరి రాజమండ్రి వద్ద 4 కి.మీ. వెడల్పు, మరియు ధవళేశ్వరం వద్ద 7 కి.మీ. వెడల్పు కలగియున్నది.

తెలుగు సాహిత్యoలో ఆదికవి నన్నయ గోదావరి నదిలో ప్రభావితుడై సంస్కృత మూలము కలగిన వ్యాస మహభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. ఇది అనువాదము మాత్రమే కాదు. నన్నయ మూలము నుండి కధను మరియు ఆలోచనలను తెసుకొని తన యొక్క స్వంత ప్రతేకార్ధ పదబంధము తిరిగి రచించాడు. కానీ దురదృష్టవశాత్తు 21/2 పర్వాలు రచించిన తరువాత మరణoచెను. అయన రచనాశైలిని అనుకరిస్తూ మిగిలిన పర్వాలను ఎర్రాప్రగడ రచించెను. ఈ కార్య త్రితత్వము తరువాత కవులచే ఉన్నతమైనదిగా ప్రశంసించబడినది. కావ్య విద్యార్ధి శ్రీనాధుడు కూడా రాజమహేంద్రవరo లోనే చాలాకాలము నివసించెను.

గోదావరి అందాలు

RJY1

గోదావరి నది యొక్క దృశ్యము ప్రతి ఒక్కరిలో కావ్యభావము కలిగించును. బాపు వంటి ఉహాత్మక దర్శకులు చాల మంది గోదావరి అందాలను వెండితెరకెక్కిoచిరి. చల్లని ప్రశాంత, వెన్నెల రాత్రి లో గోదావరి పై బోటు షికారు ఉద్వేగభరితమైన మధురానుభూతిని కలిగించును. అందమైన వస్తువు ఎప్పటికీ సంతోషము కలిగించెను. అని కీట్స్ మహాకవి ఉద్ఘాటించెను. మనమందరము అందానికి విధేయులమే. ఎపుడైనా మనము ఒక అందమైన స్త్రీని గాని, పురుషుని గాని చూసినపుడు ఆ ముఖమును పదేపదే చూడగోరుదుము. కానీ అందులో ఎటువంటి చెడు ఉద్దేశము ఉండదు. మానవ అందము ఆస్థిరమైనది. కానీ ప్రకృతి అందాలూ శాశ్వతమైనవి. గోదావరి యొక్క వయస్సు ఎవరికీ తెలియదు. మానవ అందము ఆశాశ్వతమైనైదైతే, గోదావరి అందము శాశ్వతమైనది మరియు చెరిగిపోనిది. ప్రకృతి పరిచిన పచ్చటి తివాచీపై కూర్చొని, ప్రవహిస్తున్న గోదావరిని చూస్తూ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ నది ఒడ్డున కూర్చొనుట ఒక అనుభూతి. ప్రతి దినము చూచిన విసుగురాదు. అసంఖ్యాకమైన గోదావరి అందాలను సృజనాత్మక మరియు ఉహత్మక సినిమా దర్శకులు అద్భుతముగా తెరకెక్కించి సినీ ప్రేక్షకులకు ఎప్పటికి విసుగురాని కనువిందులు చేశారు.

పట్టిసీమ:- పట్టిసీమ లేక పట్టిసం ఒక పురాతమైన పవిత్రస్థలము. ఇక్కడ శివాలయం ప్రసిధ్ధి చెందినది.

మహా నందేశ్వరాలయం:- రామయ్యపేట ఇది పట్టిసీమకు 3 కి.మీ. దూరములో ఉన్నది.

గండిపోసమ్మ ఆలయం :- మాతృశ్రీ గండిపోసమ్మ గిరిజనులకు దేవత. ఈ దేవత వారిని రక్షిస్తుందని గిరిజనుల నమ్మకం.

ఉమాచోడేశ్వర ఆలయం:- ఇది దేవీపట్నంలో నున్న 11 వ శతాబ్దపు ఆలయం. కార్తిక మాసములో వనభోజనములకు ఈ గుడి చుట్టూ వున్నా ప్రదేశములు అనుయైనవి.

విఘేశ్వర ఆలయం:- పేరంటాలపల్లి ఇది రాజమహేంద్రవరంకి 50 కి.మీ. దూరములో కలదు. ఇది దర్శించుటానికి రాజమహేంద్రవరం నుండి బోటు లేదా లాంచీ కానీ ఏర్పాటు చేసుకొనవలెను.

Godavari River

Papi Kondalu

పాపికొండలు

ఈ కొండలను మొదటిసారి చూసినపుడు “ప్రకృతి కళను మించినది” అనిన షేక్స్పియర్ మాటలు గుర్తుకొస్తాయి. గోదావరి నది యొక్క నిజమైన అందం పాపికొండలు మధ్యన ఉన్నది. పాపికొండల వైపుకు ప్రయాణిస్తున్నప్పుడు కవులు తమ పదాలలో, చిత్రకారులు తమ గీతాలలో బంధించలేని మరొక ప్రపంచము లోనికి మనము ప్రయణిస్తునట్లు అనుభూతి కలుగుతుంది. ఇది అనుభవించవల్సినదే. పాపికొండలు రాజమహేంద్రవరంకి 110 కి.మీ. దూరంలో ఉన్నవి. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ పడవలను ఏర్పాటుచేస్తుంది. మీరు ఒక్కసారి వెళ్ళినట్లయితే మరల మరల చూడాలనిపిస్తుంది.

 

 

రాజమహేంద్రవరం (రాజముండ్రి)

రాజమహేంద్రవరం గొప్ప సంస్కృతిక, కళాత్మక గత చరిత్రను కలిగిన పురాతన పట్టణము. ఇది వెయ్యి సంవత్సరరముల కన్నా పాతది. ఇది ఆంధ్రప్రదేశ్ సంస్కృతిక రాజధానిగా ఉండేది మరియు కొనసాగుతుంది. ఇది రాజమహేంద్రి, రాజమహేంద్రపురము మరియు రాజమహేంద్రవరముగా పిలువబడుతుంది. సామాన్యప్రజలు రాజమంద్రము అంటారు. కవి నన్నయ తన పేరు మీద రాజమహేంద్ర కవింద్ర సమాజము ఉండేదని అనేవాడు. బహుముఖ మేధావి, బలీయమైన సంఘసంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగము యిక్కడ జన్మించారు.

కందుకూరి వీరేశలింగము అద్భుత రచనలు చేయుటలో అగ్రగామి. పండితులకు మరియు విద్యార్ధులకు ఉపయుక్తమైన రచనలు చేసాడు. ఇతడు చాలా అంశంలో ప్రధముడిగా నిలిచినారు. గొప్ప పండితుడు మరియు కవి అయిన దివంగత సి.ఆర్.రెడ్డి. “ఆధునిక కాలపు గొప్ప ఆంధ్రుడు” అని విరేశలింగాన్ని అభివర్ణించారు. అణగద్రోక్కబడిన, దయనీయ స్థితిలో నున్న వితంతువుల జీవితాలను సరిదిద్దిటకు తన జీవితకాలాన్ని వెచ్చిoచాడు. అతని జీవితంలో ప్రతిక్షణాన్ని సంపాదనలో, ప్రతి రూపాయిని శక్తీలో, ప్రతి ఔన్సును తన తోటి వారి యొక్క మరియు స్త్రీల సంక్షేమము కొరకు ఖర్చు చేశారు. అతడు నివశించిన గృహములోనే అతడు ఉపయోగించెన కుర్చీ మరియు బల్ల మరియు పుస్తకములు భద్రము చేయుబదినవి.

RJY2రాజమండ్రిలో రాళ్ళబండ చారిత్రక, వైజ్ఞానిక ప్రదర్శనశాల దామెర్ల రామారావు చిత్రకళా ప్రదర్శనశాల మరియు గౌతమీ గ్రంధాలయము చూడదగినవి. రాళ్ళబండ చారిత్రక, వైజ్ఞానిక ప్రదర్శనశాల గోదావరి గట్టుకు దగ్గరగా నున్నది. పెద్ద సంఖ్యలో సేకరించిబడిన 6984 పుస్తకములు గల ఈ ప్రదర్శనశాలను 1967 మార్చి 1న ప్రభుత్వము స్వాధీనపరుచుకొనినది.

దామెర్ల చిత్రకళా ప్రదర్శనశాలలో ప్రముఖ చిత్ర కళాకారులైన రాజరవివర్మ, దమోర్ల రామరావు మరియు చాల మంది కళాకారులు చిత్రించిన అరుదైన చిత్రాలు కలవు. పూర్వకాలము రాజులు మరియు జమిందార్లు పండితులను, కవులనే కాక సంగీత విద్వాంసులను, చిత్ర కళాకారులను మరియు నాట్య కళాకారులను పోషించేవారు. రాజరవి వర్మ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కేరళ చిత్రకారుడు. ఇతని చిత్రాలలో జీవకళ ఉట్టిపడుతుంది. అది చిత్రకారుని చేతికుంచె మహిమ. దామెర్ల రామారావు కూడా ఇటువంటి చిత్రకారుడే. ఈయన చిన్న వయస్సులోనే మరణించినప్పటికీ ఇటువంటి వ్యక్తులకు మరణము లేదనేది నిర్వివాదాంశము. దామెర్ల రామారావు అతని చిత్రాలలోనే జీవించివున్నారు. ఆ చిత్రాలే అతనికి మరణము లేని ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

గౌతమి గ్రంధాలయము రాష్ట్రoలోనే అతి పెద్ద రెండోవ గ్రంధాలయము. ఇక్కడ వేల కొలది అరుదైన పాత పుస్తకములు భద్రము చేయబడినవి. మధురకవి నాళo కృష్ణారావు వీరేశలింగము పేరు మీదగా ఒక గ్రంధాలయాన్ని స్థాపించాడు. వాసు రాయకవి పేరు మీద మరొక గ్రంధాలయము స్థాపించబడినది. ఈ రెండు గ్రంధాలయములు 1920 లో గౌతమి గ్రంధాలయములో విలీనం చేయుబడినవి.

మార్కండేయ దేవాలయము పురాతన శివాలయం. రాజమండ్రిలో చాలా ప్రముఖ దేవాలయములు గలవు. రాజమండ్రి ప్రధాన వీధిలో గల పెద్దమసీదు పురాతనమైనది.
ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ నలభై సంవత్సరముల క్రితము రోడ్డు మరియు రైలు వంతెన నిర్మించబడినది. ప్రపంచములోనే ఇది అతి పొడవైన వంతెన. వంతెనపై బస్సులు, కార్లు, మోటార్లు సైకిళ్ళు కదులుతుండగా, క్రింద వంతెనపై లయబద్దముగా రైలు మెల్లగా కదులుటను చూడవచ్చు.
వంద సంవత్సరాలు గోదావరి రైలు వంతెన (ప్రస్తుతం మూసివేయుబడినది) కాలంతో పాటు ధ్వంసం కాకుండా నిలిచియున్నది. ఈ వంతెన అలనాటి ఇంజినీర్లు సాంకేతిక నైపుణ్యమునకే కాక కాంట్రాక్టర్ల యొక్క నిజాయతీకి నిదర్శనం.

వాల్తేరులో ఉన్నట్లుగా రాజమండ్రిలో సముద్రతీరము లేన్నప్పటికి రాజమండ్రి పట్టణానికి సరిహద్దుగా పెద్ద నది కలదు. ఈ నది తీరము అందముగా తెర్చిదిద్డబడినది. పురుషులు, స్త్రీలు, వృద్ధులు, చిన్నవారు అందరు ఈ నది తీరాన చేరి సాయంత్రపు వేళా సంతోషముగా గడుపుదురు. సంపన్న ఖాతాదారులు ఆధునిక అభిరుచులను సంతృప్తి పరచటానికి ఏర్పడిన చాలా హోటళ్ళు మరియు రిసార్టులు నది సంస్కృతిని అంతరించిపోయే విధముగా చేస్తున్నాయి.

గౌతమి ఘాట్ వద్ద నున్న ఇస్కాన్ మందిరము చూడదగినది.

ధవళేశ్వరం

ధవళేశ్వరం రాజమండ్రి పట్టణంలో ఒక భాగమై ఉన్నది.  అయినప్పటికీ దీని యొక్క స్పష్టమైన గుర్తింపును పోగొట్టుకోలేదు.  ఇది గ్రామీణ వాతావరణపు ఆకర్షణను కలిగిఉన్నది.  ఇక్కడ కాటన్ ప్రదర్శనశాల చుడదగినది.

కడియం

ఇది రాజమండ్రి 10 కి.మీ. దూరములో కలదు. రాష్ట్రంలోనే ఎక్కువ సంఖ్యలో పూలతోటలను కలిగిఉన్నది.  ఈ పూలతోటలు 6,000 ఎకరాలలో విస్తరించిఉన్నాయి.  ఇక్కడ మరెక్కడా లభించనటువంటి పూలు మరియు పండ్ల మొక్కలు సేకరణ కనిపస్తుంది.  ప్రముఖ నటులతో చిత్రీకరణ చేసేటప్పుడు ప్రముఖ చిత్ర దర్శకులకు ఈ అందమైన పూలతోటలు అతిఇష్టమైన ప్రదేశాలు.

Kadiam2అంత కాకుండా, ఆశ్చర్యపరిచే విధముగా కొన్ని మొక్కలు ఖరీదు రూ|| 20,00/-  వరకు వుంటుంది.  ఈ మొక్కలపై, పువ్వులపై, లతలపై కనబరచే ప్రేమ, అప్యాయతల ముందు ఈ మూల్యము చాల చిన్నది.

ఇక్కడ సాయంత్రపు వేళలో స్త్రీలు వివిధ కళాత్మక రూపాలలో మలచిన పూలమాలలను అమ్ముతూ వుంటారు. అనేక వర్ణాలతో కూడిన అందమైన పూలు కనులకు విందు చేస్తాయి.  గాలిలో తేలియాడే సువాసనలు మనస్సును ఆహ్లదపరుస్తాయి.  కిట్ట్స్ కవి చెప్పినట్లుగా “అందమైన వస్తువు ఎప్పటికి సంతోషాన్ని యిస్తుంది”. ఇక్కడ రాత్రి బస చేయుటకు అతిధిగృహాలు కూడా కలవు.