Close

చరిత్ర

ఆంధ్రప్రదేశ్ లోని మిగతా ప్రాంతాల వలె తూర్పు గోదావరి జిల్లా చరిత్ర నందుల కాలము నుండి తెలియజేస్తుంది. నంద సామ్రాజ్య వ్యవస్థాపకుడైన మహా పద్మనందుడు చాల దండయాత్రలు చేసి, చాల మంది చక్రవర్తులను ఓడించి, దక్కను ప్రాంతములో ఎక్కువ భాగాన్నిఆక్రమించాడు. తరువాత చరిత్రకు ఆధారములు లేవు. కాని నందులలో చివరి రాజైన ధననందుడు క్రీ.పూ 322 లో చంద్రగుప్త మౌర్యుని చే ఓడింప బడ్డాడు. అప్పటినుండి మౌర్య సమ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు దక్కను భాగములో ఎక్కువ ప్రాంతాన్నిపరిపాలించాడు.

ChandraGuptaచంద్రగుప్త మౌర్యుని తరువాత (క్రీ.పూ 297-272) వరకు బిందుసారుడు తన పరిపాలనను కొనసాగించాడు. బిందుసారుని తరువాత అశోకుడు పరిపాలించాడు.

Satavahana

మౌర్యుల తరువాత ఈ జిల్లా శాతవాహనుల చేత పరిపాలించబడినది. క్రీ.శ. 6 లేక 7 అనగా ఒక సంవత్సరం మాత్రమే హలుడు పరిపాలించాడు ఏ విధమైన రాజకీయ ప్రాధాన్యత కలిగిన అంశము లేనప్పటికి, హలుడు ఆ కాలములో గొప్ప కవుల మధ్య స్థానాన్ని సంపాదిచాడు. ఆ తరువాత కాలములో గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ. 62-86) వసిష్ట పుత్ర పులిమావి (క్రీ.శ. 86 – 114) మరియు యాగ్నశ్రీ శాతవాహనుడు (క్రీ.శ.128 – 151) పరిపాలించినట్లు త్రవ్వకములలో దొరికిన నాణెములను బట్టి తెలియుచున్నది. క్రీ.శ. మూడవ శతాబ్దపు మొదటి చతుర్దాంశక కాలము వరకు శాతవాహనులు పరిపాలించిరి.

    గుప్తుల పరిపాలకుడైన సముద్రగుప్తుడు క్రీ.శ. 350 లో ఈ జిల్లా పైకి దండయాత్రకు వచ్చి పిష్టాపురం మరియు అవముక్త యొక్క పరిపాలకులతో ఘర్షణ పడ్డాడు. ఈ పరిపాలకులతో మిగతా స్థానిక పరిపాలకులు మరియు పొరుగు రాజ్యము వారు సముద్రగుప్తుని యొక్క దాడులను ఎదుర్కొనిరి.  అయితే వీరు ఐక్యముగా చేసిన వ్యతిరేకత యొక్క పర్యవసానాలు తెలియలేదు.SamudraGupta-I

సముద్రగుప్తుని దండయాత్ర తరువాత మథరకులకు చెందిన రాజులచే వరుసగా పరిపాలించబడినది. (క్రీ.శ.375 నుంచి 500 వరకు). వీరిలో మొదటి పరిపాలకుడు మహారాజా శక్తివర్మన్. ఈ జిల్లా విజయేంద్ర వర్మ పరిపాలన తరువాత విష్ణుకుండీనులు పరిపాలించిరి. వారు రెండు శతాబ్దములు క్రీ.శ. 5 శతాబ్దము మొదటి చతుర్దాంశము నుండి ఇంచుమించుగా రెండు శతాబ్దములు పరిపాలించిరి. గ్రంధస్థము కాబడిన సమాచారము ప్రకారము వీరి సామ్రాజ్యము విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణ మరియు గుంటూరు ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా వరకు విస్తరించి వుండేది. రాష్ట్రానికి చేసిన సేవలకు గుర్తింపుగా దుర్జయ కుటుంబమునకు చెందిన రాణా దుర్జయుడు విజయేంద్ర వర్మ యొక్క దాసునిగా పిష్టాపురం లేదా పిఠాపురమును పరిపాలించెను. తరువాతి కాలములో వశిష్టకుల పరిపాలకులను ఓడించి విష్ణుకుండినులకు చెందిన ఇంద్రభట్టారక రాజు ఈ ప్రాంతముపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు.

ఇతని ఆధిపత్యము కొంతకాలము మాత్రమే సాగినది. చిన్న చిన్న పాలకుల సహకారముతో కాలింగ రాజుల ఏలుబడి ఇంద్రభట్టారక యొక్క సైన్యమును పూర్తిగా వసపరుచుకొనినది. దీని పర్యవసానముగా విష్ణుకుండినులు బలహీనులై వెనుకంజ వేసిరి. ఇంద్రభట్టారక వంశమునకు చెందినవారు రాజ్య పరిపాలన కొనసాగించిరి. వీరిలో చివరివాడైన మాధవవర్మ III యుద్దములో చంపబడ్డాడు. ఇతని కుమారుడైన మంచన్న భట్టారకుడు వంశపారంపర్య సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినా విజయవంతం కాలేదు.

Chalaukyaతరువాత పశ్చిమ చాళుక్యులైన బాదామి పులకేసిన్ II, అతని సోదరుడు కుబ్జ విష్ణు సహాయముతో పిష్టాపురంపై దాడి చేసి విజయము సాధించాడు. కుబ్జ విష్ణు యొక్క సేవలును ప్రశంసిస్తూ అతనికి క్రొత్తగా సాధించబడిన తూర్పు రాజ్యములు బహుమతిగా ఇవ్వబడినవి.

కుబ్జ విష్ణు మొదట పిష్టాపురం నుండి పరిపాలన ప్రారంభించి, తరువాత వేంగి నుండి మరియు రాజమహేంద్రి (రాజమండ్రి) నుండి తన పరిపాలన కొనసాగిస్తూ, తూర్పు చాళుక్య సామ్రాజ్యమును స్తాపించాడు. తరువాత చాల మంది రాజులు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించినప్పటికి, వారసత్వ గొడవలు ఎక్కువ జరిగినట్లు చరిత్ర ద్వారా తెలియచున్నది.

 

క్రీ.శ. 892 – 921 మధ్య కాలములో పరిపాలించిన చాళుక్య భీముడు I ద్రాక్షారామం లో శివాలయం నిర్మించాడు.Chalukyasతరువాత కాలములో ఆధిపత్యము కొరకు జరిగిన పౌరయుద్దాలలో విజయాదిత్యుడు IV యొక్క కుమారుడైన అమ్మ I విజయం సాధించి ఏడు సంవత్సరాలు సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అమ్మ I కుమారుడైన విజయాదిత్యుడు V పట్టాభిషిక్తుడైన పక్షము రోజులలోనే పదవి నుంచి తొలగించబడినాడు. అతడు స్థాపించిన సామ్రాజ్యములోని పిఠాపురము కోటలోనికే అతడు ఆశ్రితుడుగా పంపబడ్డాడు.

క్రీ.శ. 973 లో కర్నూలు జిల్లా పెదకల్లు ప్రాంతము యొక్క జట చోడ భీముడు చాళుక్య రాజైన ధనర్నవను చంపి వేంగి ప్రాంతమును ఆక్రమించి 27 సంవత్సరములు పరిపాలించాడు. ధనర్నవుని ఇద్దరు కుమారులు శక్తివర్మన్ I మరియు విమలాదిత్య సమ్రాజము నుండి పారిపోయి, చోళ రాజైన రాజ రాజ I (క్రీ.శ. 985-1016) వద్ద ఆశ్రయం పొందిరి. చిన్నవాడైన విమలాదిత్యుడు రాజ రాజ యొక్క కుమార్తె కుందవాయిని వివాహమాడాడు. ధనర్నవ యొక్క కుమారుల కొరకు రాజ రాజుడు వేంగి పై దండయాత్ర చేసి జట చోడ భీముని చంపి వేంగిని స్వాధీనం చేసుకున్నాడు. కళ్యాణికి చెందిన పశిమ చాళుక్యుల యొక్క పరిపాలకుడైన సత్యాశ్రయునికి ఇది నచ్చలేదు. దీని ఫలితముగా పశ్చిమాన్న వున్న కళ్యాణి యొక్క చాలుక్యులకు చోళులకు మధ్య పోరుకు వేంగి మూలకారణమైనది. క్రీ.శ. 1075లో విజయాదిత్యుడు VII మరణముతో తూర్పు చాళుక్యుల సామ్రాజ్యము అంతమైనది.

విక్రమాదిత్యుడు VII యొక్క శత్రువైన తూర్పు చాళుక్య రాజకుమారుడు రాజేంద్రుడు కుళోత్తుంగ I గా చోళ సింహాసనమునకు పట్టాభిషిక్తుడైన తరువాత ఈ జిల్లా వేంగి ప్రాంతముతో కలసి చోళ సామ్రాజ్యములో ఒక భాగముగా పరిగనింపబడినది. ఈ రాజులు చాళుక్య-చోళులుగా పిలవబడిరి. కుళోత్తుంగ I తన కుమారులైన రాజ రాజ ముమ్మడిచోడుడు, వీర చోడుడు, రాజ రాజ చోడ గంగ మరియు విక్రమచోళుడులను వేంగికి రాజుకు ప్రత్యామ్నాయముగా (వైశ్రాయ్) నియమించినాడు. అదే సంవత్సరములో వెలనాడు రాజులచే ఈ జిల్లా యొక్క దక్షిణ భాగమును పరిపాలించుటకు విక్రమచోళుడు వెనుకకు పిలవబడినాడు కాని అతని పరిపాలన సఫలం కాలేదు. దీనిని అవకాశముగా తీసుకొని పశ్చిమ చాళుక్య రాజైన విక్రమాదిత్య VI వెలనాడు రాజును లోబర్చుకున్నాడు. తరువాత విక్రమాదిత్య VI యొక్క వారసుడు సోమేశ్వరుడు III పరిపాలించాడు. విక్రమ చోళుని తరువాత కుళోత్తుంగ III, రాజ రాజుడు II, రాజాధిరాజుడు చోళ సింహాసనాన్ని అధిష్టించారు. రాజ రాజుడు II యొక్క కాలములో వెలనాడు రాజులు స్వతంత్రులై వీరి వున్నతి కొరకు ప్రణాళికలను రచించిరి. అప్పటికి జిల్లాలో ఎక్కువ భాగము స్థానిక సామ్రాజ్యమైన వెలనాటి చోళులు పరిపాలించిరి. ఈ సామ్రాజ్యానికి చెందిన ఇతర రాజులు గొంక I, గొంక II కుళోత్తుంగ రాజేంద్ర చోళుడు I మరియు కుళోత్తుంగ రాజేంద్ర చోళుడు II (క్రీ.శ. 1108-1181).

క్రీ.శ. 1181 కుళోత్తుంగ రాజేంద్ర చోళుడు II (క్రీ.శ. 1108-1181) యొక్క ఆకస్మిక మరణానంతరము, ఇతని వారసుల మద్య పౌరయుద్ధము జరిగినది దీని వలన ఈ జిల్లాలో వెలనాటి చోళుల పరిపాలన అంతమైనది. కళ్యాణికి చెందిన పశ్చిమ చాళుక్యుల యొక్క రాజ్యాధికారాన్ని త్రోసిపుచ్చి, కాకతీయ సామ్రాజ్యానికి చెందిన ప్రోలుడు II స్వతంత్రుడుగా ప్రకటించుకున్నాడు. ఇతని కాలములో ఇతనిని కోన యొక్క హాయిహాయిస్ వ్యతిరేకించిరి. ప్రోలుడు II తరువాత అతని కుమారుడైన రుద్రుడు (క్రీ.శ. 1150-1195) చాళుక్య చోళ చక్రవర్తి యైన రాజ రాజుడు II నుండి గోదావరి డెల్టా ప్రాంతమును పొందాడు. తన తండ్రి యొక్క ఓటమికి కారణమైన కోన యొక్క హాయిహాయిస్ పై పగ తీర్చుకొనుటకు ప్రయత్నించాడు. క్రీ.శ. 1158 లో ద్రాక్షారామము వద్ద వున్న శిలాఫలకము దీనికి సాక్ష్యము. గోదావరి డెల్టా ప్రాంతమైన రుద్రుని యొక్క అధికారమును వెలనాటి చోళులు సవాలు చేశారు.

రుద్రునికి వ్యతిరేకముగా వెలనాటి రాజైన కుళోత్తుంగా రాజేంద్ర చోళుడు II సైన్యాన్ని పంపించాడు. రాజేంద్ర చోళుడు II యొక్క మంత్రియైన దేవన్న ప్రగడ ముందు సామ్రాజ్యము యొక్క సరిహద్దును సముద్రము వరకు తగ్గించి క్రీ.శ. 1163లో ద్రాక్షారామము వద్ద ఈ విషయమును ప్రకటించాడు. అక్కడ నుండి ముందుకు వెళ్లి కోన యొక్క హాయిహాయిస్ లను ఓడించి తమ సార్వభౌమాధికారమును వారు అంగీకరించేలా చేశాడు. అయినప్పటికీ రుద్రుడు వారిని ఈ ప్రాంతములో ప్రశాంతముగా వుండనీయలేదు.

క్రీ.శ. 1172 లో చాళుక్య చోళ చక్రవర్తియైన రాజ రాజుడు II మరణానంతరము కుళోత్తుంగా రాజేంద్ర చోళుడు II అధికార పతనాన్ని అవకాసముగా తీసుకొని సముద్ర తీర ప్రాంతమునకు అధికారిగా ప్రకటించుకున్నాడు. ఊహించని ఇతని మరణము కారణముగా వెలనాడు చోళులు వెనుకంజ వేసిరి.

రుద్రుని తరువాత అతని చిన్న సోదరుడు మహాదేవుడు రాజయ్యాడు. ఇతడు దేవగిరి యొక్క యాదవులతో జరిగిన సంగ్రామములో మరణించాడు. ఇతని కుమారుడైన గణపతి కాకతీయ సింహాసనమును అధిష్టించాడు. ఇతడు కృష్ణాజిల్లాలోని దివిని జయించాడు. తనసైన్యమును కళింగకు పంపించి కళింగను ఆక్రమించుకున్నాడు. తూర్పు గంగ రాజైన అమియాంక భీముడు III మరియు అతని కుమారుడు నరసింహుడు I గణపతితో నిరంతరముగా పోరాడారు. గణపతి గోదావరి ఉత్తర భాగమునకు సైన్యమును పంపించి, అక్కడ జరిగిన భీకర యుద్దములో శత్రువులను వేగముగా తిరోగమించేలా చేశాడు. మధుర యొక్క పాండ్యలతో జరిగిన పోరులో గణపతి గెలిచి పాండ్యల యొక్క మిత్రులైన కొప్పెరంజింగను విదేశీపాలన అంగీకరించేలా చేశాడు. ఈ విజయము వలన గోదావరి లోయలో కాకతీయ పాలన సుస్థిరముగా గణపతి పరిపాలన చివరివరకు కొనసాగినది.

RudramaDeviగణపతి కుమార్తె యైన రుద్రాంబ (క్రీ.శ. 1259-95) పాలన కొనసాగించింది. ఆమె కాలములో పూర్తి గోదావరి భాగమంతా ఆమె ఆధీనములో వున్నది. క్రీ.శ. 1295 లో ప్రతాప రుద్రుడు పరిపాలించాడు. అతని పాలనలో ఢిల్లీ సుల్తానులు చాలా దండయాత్రలు చేశారు. క్రీ.శ. 1323 లో మమ్మాద్-బీన్-తుగ్లక్ చే ఓడింపబడిన ప్రతాపరుద్రుడు ఢిల్లీ కి ఖైదీగా పంపించబడ్డాడు. దీనితో ఈ జిల్లాలో కాకతీయ అధినివేసముతో పాటు ఢిల్లీ సుల్తానుల చేతిలోనికి వెళ్ళినది.

మమ్మాద్-బీన్-తుగ్లక్ దక్కన్ మరియు దక్షిణ భారతాన్ని ఐదు రాజ్యములుగా విభజించి రాజ్యపాలకులను నియమించినాడు. కాని వారి పరిపాలన అపకీర్తిపాలైనది. అక్కడ నివసిస్తున్న నాయకులు ఒక సమాఖ్యను ఏర్పాటుచేసి, ముసునూరు కుటుంబమునకు చెందిన ప్రోలయ నాయకను నాయకుడుగా ఎన్నుకొనిరి. తిరుగుబాటుదారుల కారణముగా కొండవీటి రెడ్లు, విజయనగర రాయలు, రాచకొండ రేచర్లు, గుల్బర్గా బహ్మనీలు, వరంగల్ ముసునూరి రాజులు రాజ్యములను స్థాపించిరి. మరియు ప్రోలయ నాయకుడు ఆంధ్ర తీరప్రాంతమునకు తిరుగులేని నాయకుడయ్యాడు. మంచికొండ ముఖ్యుడు, కోరుకొండ ముమ్మడి నాయక, కళింగ యొక్క నరసింహదేవ IV ఈ రాజకీయ అనిశ్చితిని అవకాసముగా తీసుకొనుటకు ప్రయత్నించిరి. వారు ఈ భాగమును జయించినప్పటికి ఈ అధికారము వారిచేతిలో ఎంతోకాలము లేదు. రెడ్డి రాజైన అనవోలు సింహాసనమును దక్కించుకొన్నాడు. ఇతని తరువాత వరుసగా అనవేమారెడ్డి (క్రీ.శ. 1364-86) మరియు కుమారగిరి (క్రీ.శ. 1386) పరిపాలించారు.

కుమారగిరి రాచకొండ యొక్క రేచర్లతోను, కళింగరాజులతోను చాల యుద్దాలు చేశాడు. ఇతడు తన సైన్యాధ్యక్షుడైన కట్టయ్యవేమతో అనవోలు రాజకుమారిడిని తూర్పు భూభాగములను జయించుటకు పంపించినాడు. దీని ఫలితముగా ఉత్తరాన సింహాచలము వరకు ఆక్రమించుకొన్నారు. రెడ్డి సామ్రాజ్యము ఆక్రమించుకొన్న ఈ క్రొత్త రాజ్యము తూర్పు సామ్రాజ్యము లేక రాజమహేంద్ర రాజ్యముగా పిలవబడే ప్రత్యేక రాజ్యముగా ఏర్పడినది. ఈ ప్రత్యేక రాజ్యము రాజమహేంద్రవరమును రాజధానిగా చేసుకొని అనవోలు రాజకుమారుడు తన పరిపాలనను కొనసాగించినాడు. ఇతని ఆకస్మిక మరణానంతరము క్రీ.శ. 1395 లో సైన్యాధిపతి మరియు కుమారగిరికి బావమరిది యైన కట్టయ్యవేమకు రాజ్యానికి అతడు చేసిన సేవలను ప్రశంసిస్తూ రాజమహేంద్ర రాజ్యము ఇవ్వబడినది. కట్టయ్యవేమ రాజమహేంద్రవరము తరలిపోగా, కొండవీడు సింహాసనము పెదకోమటి వేమ చేత బలవంతముగా తీసుకొనబడినది.

పెదకోమటి వేమ యొక్క అధికారాన్ని కట్టయ్యవేమ నిర్దేశించేవాడు. రాజమహేంద్ర రాజ్యములో అధికభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన ఏరువా ముఖ్యుడు. అన్నదేవ చోడతోను కట్టయ్యవేమ ఘర్షణ పడ్డాడు. చివరికి కట్టయ్యవేమ వీరిని ఓడించాడు. తరువాత అన్నదేవ చోడతో జరిగిన యుద్దములో కట్టయ్యవేమ మరణించాడు. అతని మరణానంతరము అల్లాడరెడ్డి తన ప్రతినిధిగా కట్టయ్యవేమ యొక్క కుమారడైన కొమరగిరికి రాజమహేంద్రవరము సింహాసనము అప్పగించినాడు. కానీ కొమరగిరి ఆకస్మికముగా మరణించినాడు. తిరిగి అల్లాడరెడ్డి ఈ రాజ్యమును క్రీ.శ.1420 లో తాను మరణించేంత వరకు పరిపాలించాడు. క్రీ.శ.1423 లో ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న వీరభద్రుని విజయనగర రాజైన దేవరాయుడు II ఓడించి వీరభద్రుడుని లోబరుచుకున్నాడు.

ఈ కాలమునందు కొప్పుల నాయకుల యొక్క వీరసామంతులుగా పిలువబడే కట్టుబడితనము కలిగిన నాయకుల యొక్క సామ్రాజ్యము ప్రాముఖ్యతను సంతరించుకొనినది. వరంగల్ యొక్క కాకతీయుల పతనము తరువాత చిన్న రాజ్యమైన కోరుకొండ నాయకుల యొక్క రాజ్యము శక్తిని పుంజుకొంది. ఈ కుటుంబము యొక్క చారిత్రక ఆవిర్భావము ఎవరికీ తెలియదు. ఈ కోరుకొండ నాయకులు తరువాత కాలములో బలోపేతమై శక్తివంతమైన పొరుగువారితో వివాహ సంబంధములను కలుపుకొన్నారు. ఈ కుటుంబమునకు చెందిన ముమ్మిడినాయక ముసునూరి ముఖ్యుడైన కపాయనాయక యొక్క మేనకోడలును వివాహమాడాడు. ఇతడు తొయ్యేటి అనవోలు నాయక యొక్క తీరప్రాంత భాగమును జయించాడు. ఇతడు తరువాత గోదావరికి ఇరువైపులా వున్న పనర, కోన, కురవట రాజ్యములను లోబర్చుకున్నాడని విశ్వసిస్తారు. ముమ్మడి నాయక క్రీ.శ.1988 వరకు జీవించాడు. ఇతని యొక్క ముగ్గురు కుమారులు నలభై సంవత్సరముల పాటు పరిపాలించారు. తరువాత వీరు కొండవీడు రెడ్లకు లోబడి తమ రాజ్యమును కొండవీడు రాజ్యములో కలిపివేశారు.

క్రీ.శ.1470 లో కపిలేశ్వర గజపతి మరణం తర్వాత వారసత్వం కొరకు అతని కుమారులైన హమవీర మరియు పురుషోత్తమునికి మధ్య పోరు జరిగింది. బహామనీల సహాయముతో హమవీర సింహాసనాన్ని గెలుచుకొన్నప్పటికి ఎక్కువ కాలం నిలవలేదు. పురుషోత్తముడు రాజమండ్రి మరియు ఇతర ప్రాంతాలను తిరిగి జయించాలని హమవీరను తొలగించాడు. కాని మొహమ్మద్ షా –III తన సైన్యాన్ని రాజమండ్రికి పంపించాడు. ఈ యుద్ధం శాంతి ఒప్పందంతో ముగిసింది. మొహమ్మద్ షా –III యొక్క మరణం తర్వాత పురుషోత్తమ గజపతి, గోదావరి, కృష్ణా ప్రాంతాలలోని బహామనీ సైన్యాలను తరిమికొట్టాడు. ఇతని తరువాత ఇతని కుమారుడు ప్రతాపరుద్రుడు పరిపాలించాడు. విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయ దందయాత్రలో రాజమండ్రిని ఆధీనంలోకి తీసుకున్నాడు. కాని ఒక ఒప్పందం ప్రకారం ప్రతాపరుద్రుడు తన కుమార్తెను కృష్ణదేవరాయకిచ్చి వివాహం చేసాడు. దానికి బదులుగా కృష్ణదేవరాయ జయించిన కృష్ణ యొక్క ఉత్తర భూభాగాన్ని ప్రతాపరుద్రునికి తిరిగిచ్చాడు.

ఈ అనిశ్చిత పరిస్థితులను అవకాసముగా తీసుకున్న కుతుబ్షాహీ రాజైన సుల్తాను ఖులీ ఖుతుబ్ షా తీర ప్రాంతము పై దండయాత్ర చేసి రాజమండ్రి మరియు పొరుగు
Quli Qutub Shahరాజ్యములను స్వాదీనం చేసుకున్నాడు. సుల్తాను ఖులీ హత్య జరిగిన తరువాత వరుసగా అతని కుమారుడు జంషీద్ ఖుతుబ్ షా మరియు మనవడు సుభాన్ ఖుతుబ్షా వారసులైరి. వీరి పరిపాలన కాలములో షితాబ్ ఖాన్ మరియు విద్యాధర్ల యొక్క సవాళ్ళను ఇభ్రహీం ఖుతుబ్ షా విజయవంతముగా ఎదుర్కొనెను. ఈ రాజవంశములో చివరి పాలకుడు అబ్దుల్ హసన్ తానాషా (క్రీ.శ.1672-87).

ఈ కాలములో మొగలుల యొక్క శక్తిసామర్ద్యములు దక్షిణానికి వ్యాపించాయి. మొగలుల సామ్రాజ్యములో గల 22 రాష్ట్రాలలో ఒకటైన గోల్కొండ రాష్ట్రములో ఈ తూర్పుగోదావరి జిల్లా కలుపబడినది. మొగలుల చక్రవర్తి ఔరంగజేబు ఈ రాష్ట్రాలను పాలించుటకు తన ప్రతినిధులను నియమించినాడు. గోల్కొండ యొక్క వైస్రాయ్ (ప్రతినిధి) సైన్యాదికారులైన ఫౌజ్దార్లు ద్వారా పరిపాలన నిర్వహణ కొనసాగించాడు. మొగల్ చక్రవర్తి ఫరూక్ సియర్, నిజామ్-ఉల్-ముల్క్ ను దక్కనుకు తన ప్రతినిధులుగా నియమించినాడు. అతనికి బదులుగా మహమ్మద్ షా కాలములో హుస్సేన్ ఆలీఖాన్ నియమించబడినాడు. క్రీ.శ.1724 లో నిజామ్-ఉల్-ముల్క్ దక్కనుపై దండయాత్ర చేసి ముబారిజ్ ఖాన్ ను ఓడించి, చంపివేసి స్వతంత్ర సామర్ధ్యముతో దక్కన్ను పరిపాలించాడు.

క్రీ.శ.1748 లో నిజామ్-ఉల్-ముల్క్ యొక్క మరణానంతరము అతని కుమారుడు నసీర్ జంగ్ మరియు మనవడు ముజాఫర్ జంగ్ ల మధ్య వారసత్వము కోసము యుద్దము జరిగినది. ఫ్రెంచి వారు ఇంగ్లీషు వారు చెరొకవైపున నిలిచారు. దీని ఫలితముగా ఫ్రెంచి సైన్యాధ్యక్షుడు బుస్సీ సహాముతో సల్బత్ జంగ్ కు పట్టాభిషేకము జరిగినది. భారత దేశములో ఫ్రెంచి ఆస్తులకు క్రొత్త గవర్నర్-జనరల్ యైన లాల్లీ చేత బుస్సీ దక్షిణానికి రావాలని ఆజ్ఞాపించబడ్డాడు. అతడు వెళ్ళిన వెంటనే విజయనగరానికి క్రొత్తరాజైన ఆనందరాజు, ఉత్తర సర్కార్లను ఆక్రమించవలసినదిగా ఇంగ్లీషు వారిని ఆహ్వానించాడు. ఇందుమూలముగా ఇంగ్లీషు మరియు ఫ్రెంచి వారి మధ్య జగడములకు పర్యవసానముగా ఉత్తర సర్కార్లలో ఫ్రెంచి వారు తమ ఆస్తులను కోల్పోయరు.

సల్బత్ జంగ్ను అతని తమ్ముడు నిజాంఆలీఖాన్ అధికారం నుంచి తొలగించాడు. తరువాత నిజాంఆలీఖాన్ రాజమండ్రి మరియు శీకాకోల్ ను హసన్ ఆలీఖాన్ కు అద్దెకు యిచ్చాడు. ఉత్తర సర్కార్లను ఇచ్చివేయడంపై లార్డ్ క్లైవ్ చర్చలు జరిపి ఒక ఫర్మానా క్రీ.శ.1765 ఆగష్టు నుండి అమలులోనికి వచ్చే విధముగా ఇచ్చినప్పటికీ, అది క్రీ.శ.1766 మార్చి వరకు రహస్యముగా ఉంచబడినది. అవరసరమైన సైనిక కార్యకలాపాలు చేపట్టటానికి జనరల్ సిల్లాడ్ మచిలీపట్నం పంపబడ్డాడు. నిజాం కూడా వేగముగా యుద్ద సన్నాహాలు చేశాడు. ఇవన్నికూడా ఒక ఒప్పందంతో ముగిసిపోయాయి. ఆ ఒప్పందం ప్రకారము ఇంగ్లీషు వారు ఉత్తర సర్కార్లకు కొంత పరిహారము యిచ్చుటకు మరియు నిజాంకు కొన్ని సైనిక దళాలను యిచ్చేందుకు అంగీకరించారు. ఈ ఒప్పందము క్రీ.శ.1768లో మరియొక ఒప్పందముతో ధ్రువీకరించబడినది. క్రీ.శ.1768 లో హసన్ ఆలీఖాన్ యొక్క లీజు పూర్తవడంతో రాజమండ్రి మరియు ఏలూరు, మచిలీపట్నంలో క్రొత్తగా నియమించబడిన పాలకసంస్థ ఆధీనములోకి వచ్చినవి.

Rao_Venkata_Kumara_Mahipati_Surya_Raoఇంగ్లీషు వారికి జిల్లా బదిలీ అయిన తర్వాత కాలములో జమీందారుల ప్రాముఖ్యత పెరిగినది, రంప, పెద్దాపురం, పిఠాపురం, కోట, మరియు రామచంద్రపురం జమీందార్లు ఈ జమీందారీ వ్యవస్థలో ముఖ్యమైనవారు.