అటవీ పర్యాటక రంగం
ఈ జిల్లాలో అటవీ ప్రాంతం 336 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో జిల్లా వైశాల్యంలో 32 శాతాన్ని ఆక్రమించుకొని ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకంలో, అటవీ పర్యాటక రంగం అతిత్వరగా అభివృద్ధి చెందే విభాగంగా భావించి ఈ రంగాన్ని తీర్చిదిద్దారు ఈ అటవీ పర్యాటక రంగం, స్థానిక జన సమూహాల అభివృద్ధికి అటవీ నిర్వహణ సహాయ పడేలా చేస్తుంది.
అటవీ క్షేత్ర సందర్సన, వృక్ష జాతులు మరియు జంతుజాలం యొక్క ప్రకృతి సిద్ధమైన ఆవాసాలను పరిశీలించడానికి పర్యాటకులకు అవకాశం లభిస్తుంది. ఈ పర్యటనల అనుభవం వలన కలిగే ప్రయోజనాలు మాటలకు అందనివి, కంటికి కనిపించనివి, మానసికమైనవి మరియు లెక్కించలేనివి, అభయారణ్యాలు అటవీ జీవితానికి కొంచెం భిన్నమైనవి ఐనప్పటికీ, ఇక్కడి ప్రకృతి వాటి సారాన్ని అందించగలదు.
కోరింగ వన్యప్రాణుల అభయారణ్యము: అనేక వృక్ష జాతులకు, జంతువులకు ఆవాసమైన కోరింగ అభయారణ్యం. కాకినాడకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. చాలా విభిన్న రకాల మొక్కలు, పక్షులు మరియు కొద్ది సంఖ్యలో ఉండే గోల్డెన్ తోడేళ్ళు, సముద్ర తాబేళ్లు మరియు చేపలు వేటాడే పిల్లి, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణలు.
రంపచోడవరం: రంపచోదవారంలో దట్టమైన అడవి మరియు జలపాతాలు వున్నవి. ఈ ప్రదేశాలను జీపుల ద్వారా చేరుకోవచ్చు. దట్టమైన అడవి మధ్య పర్యటిస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచే అనుభవం కలుగుతుంది. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం, కాకినాడ నుండి 82 కి.మీ.ల దూరంలో ఉంది. రంపచోడవరం చుట్టు ప్రక్కల ప్రాంతాలు తమ సహజ అందాలతో ప్రాంతీయ సినిమా వారిని ఆకర్షిస్తాయి.
అడ్డతీగల: కాకినాడ నుండి 67 కి.మీ. దూరంలోనూ, రాజమహేంద్రవరంకి 65 కి.మీ. దూరంలో వుంది. అడ్డతీగల అడవిలో పర్వతాలు, సెలయేర్లు మరియు లోతైన విశాలమైన లోహాలు ఉన్నాయి. ఈ ప్రాంతము భాషా సంస్కృతుల, సంప్రదాయాల వైవిధ్యం కలిగిన విభిన్నమైన గిరిజన ప్రజా సమూహాలకు ఆతిధ్యం ఇస్తున్నది.
మారేడుమిల్లి: మారేడుమిల్లి నదుల ప్రక్కన అడవి మధ్యలో ఉంది. ఇది రాజమహేంద్రవరం నుండి 87 కి.మీ.ల దూరంలో ఉన్నది. ఈ ప్రదేశం కొండలతోను, జలపాతలతోను పర్యాటకుల హృదయాలను కొల్లగోడుతుంది. ఇక్కడ రెండు జంగిల్ రిసార్ట్స్ కూడా ఉన్నవి. ఇక్కడ కాఫీ మరియు రుబ్బరు తోటలు ఎక్కువగా వున్నాయి.
సీతపల్లి: కాకినాడ నుండి 75 కి.మీ. దూరంలోను రాజమహేంద్రవరం నుండి 51 కి.మీ. దూరంలోను ఉంది. సీతపల్లికి దగ్గరలో రైల్వేస్టేషన్లు లేనప్పటికీ, దగ్గరలోనున్న రాజమహేంద్రవరం పట్టణంలో రెండు రైల్వేస్టేషన్లు వున్నాయి. పగటి పూట ప్రయాణం సురక్షితమని భావిస్తారు. ఇక్కడ శ్రీ బాపనమ్మ తల్లి గుడి ప్రసిధ్ధి చెందినది.