ఇంజనీరింగ్ పర్యాటక రంగం
ఈ జిల్లాలో అనేక ఇంజనీరింగ్ అద్భుతాలున్నయి. ఈ అద్భుతాలు సందర్సన పర్యాటకులకు, జ్ఞాన సముపార్జనకి దోహదపడతాయి. ఇవి వాణిజ్యము, రవాణా మరియు అభివృద్ధి కొరకు చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడ ఇంజనీరింగ్ అద్భుతాలు విజ్ఞానాన్ని, వినోదాన్ని ఇవ్వడమే కాకుండా, వీటి సహాయంతో ఈ జిల్లా ఏ విధంగా ఉన్నత శిఖరాలనందుకున్నదో తెలియజేస్తాయి.
రోడ్డు కమ్ రైల్వే వంతెన : (రోడ్డు మరియు రైలు మార్గము కలిగిన వంతెన)
అందమైన గోదావరి నది పై నున్న ఈ బ్రిడ్జి, ఆసియా ఖండంలోని పెద్ద రోడ్డు మరియు రైల్వే వంతెనలలో మూడవది. ఈ వంతెన భారత రైల్వే శాఖలో దక్షిణ మధ్య రైల్వే విభాగము వారి అధికార వర్గంచే ఏర్పాటు చేయబడింది. దీని పొడువు 4.1 కిలోమీటర్లు. 1970 లో దీని యొక్క నిర్మాణం బ్రెత్ వెయిట్ (Braithwaite), బర్న్ అండ్ జేస్సోప్ కన్స్ట్రక్షన్ కంపెనీ (Burn and Jessop construction company) వారిచే ప్రారంభించబడినది. 1974, ఆగష్టు 16 న భారత రాష్ట్రపతి, ఫక్రుద్దీన్ అలీ ఆహమ్మద్, ఈ వంతెనని జాతికి అంకితం చేశారు.
హావేలాక్ వంతెన – (The Havelock Bridge)
గోదావరి నది పై ఉన్న పాత వంతెనను హవేలాక్ వంతెన అని కూడా అంటారు. హౌరా మరియు మద్రాస్ మధ్య నడిచే రైళ్ళు ఈ వంతెన పై ప్రయనించేవి. 1897 నవంబర్ 11న ఈ వంతెన యొక్క నిర్మాణం ప్రారంభమైనది. అప్పటి మద్రాస్ గవర్నర్ అయిన సర్ ఆర్డర్ ఎలిబoక్ హేవలాక్ పేరు మీద ఈ వంతెన హవేలాక్ వంతెన గా పిలవబడింది. ప్రస్తుతం ఈ వంతెన ఇంజనీరింగ్ పర్యాటక ప్రదేశం గా మార్చబడినది.
ఆర్చ్ వంతెన: Arch Bridge
పాత బడిన హవేలక్ వంతెన యొక్క స్థానాన్ని భర్తీచేయడం కోసం గోదావరి పై ఈ ఆర్చ్ వంతెన నిర్మాణం జరిగింది. 1991 లో ప్రాంరంభామైన ఈ వంతెన నిర్మాణం 1997 వరకు కొనసాగింది. 2003 లో ఇది రైళ్ళ రాకపోకలకు వాడుకలోకి వచ్చింది. రాజమoడ్రి వద్ద గోదావరి నది పై విస్తరించి ఉన్న మూడు వంతెనలలో ఇదే తాజా నిర్మాణము. ఈ వంతెన కొవ్వూరు మార్గము మరియు రాజమoడ్రి మార్గము అనే రెండు మార్గాలు కలిగి ఉంది. దీనిని కొవ్వూరు రాజమoడ్రి వంతెన అని కూడా అంటారు.
నాల్గోవ వంతెన: The Fourth Birdge
ఇది నాలుగు దారుల కలిగిన వంతెన. ప్రస్తుతం ఉన్న రోడ్డు మరియు రైల్వే వంతెనపై రద్దీని తగ్గించే లక్ష్యంతో ఈ వంతెన నిర్మించబడినది. ఈ నిర్మాణం వలన చెన్నై మరియు కలకత్తా మధ్య 50 కిలోమీటర్లు దూరం తగ్గింది.
కాటన్ వంతెన: Cotton Bridge
1850 లో, బ్రిటిష్ వారి నీటిపారుదల శాఖా ఇంజనీర్, సర్ ఆర్ధర్ కాటన్ యొక్క పర్యవేక్షణలో, గోదావరి నదిపై ధవళేశ్వరం బ్యారేజు నిర్మించబడింది. ఇప్పటికీ ఇది ఒక ఇంజనీర్ అద్భుతంగా నిలిచింది.